Movies

‘గ్యాంగ్‌లీడర్‌’ లో చిరంజీవికి నచ్చని విషయాలు ఉన్నాయంటే నమ్ముతారా?

ఆ రోజుల్లో మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు పండగే. ఇక సినిమాలో విజయశాంతి కలిస్తే అది బ్లాక్ బస్టర్ అవుతుంది. అటువంటి సినిమాయే ‘గ్యాంగ్ లీడర్’. ఈ సినిమాలో గెటప్ పరంగానూ, కాస్ట్యూమ్స్‌ పరంగానూ, నటన పరంగానూ చిరంజీవి రేంజ్ కి తీసుకువెళ్ళింది. ఈ సినిమా విడుదల అయ్యి 27 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సినిమా వసూళ్ళ పరంగా కూడా రికార్డ్స్ సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకి సంబందించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. 
‘గ్యాంగ్ లీడర్’ సినిమా 1991 మే 9 న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన విజయ బాపినీడు మొదట నాగబాబుని హీరోగా పెట్టి తీయాలని అనుకున్నారు.

‘ఖైదీ నెంబర్ 786’ సినిమా సమయంలో చిరంజీవి మరో సినిమా చేస్తానని బాపినీడుకి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం చిరు బాపినీడుకి కబురు పంపారు. దాంతో సమయం లేకపోవటంతో నాగబాబుతో తిద్దమని అనుకున్న కథను చిరుకి వినిపిస్తే చిరు ఒకే చేసేసారు. 
చిరంజీవికి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా టైటిల్ నచ్చలేదట. బాపినీడు ఎంతో నచ్చచెప్పిన తర్వాత చిరు ఒప్పుకున్నారట.

ఈ సినిమాలో చిరంజీవికి అన్నయ్యగా మొదటగా కృష్ణంరాజుని అనుకున్నారు. ఆ తర్వాత మురళీమోహన్ ని ఎంపిక చేసారు. వదిన పాత్రలో సుధను సినీ రంగానికి పరిచయం చేసారు. చిరుకి మరో అన్నగా శరత్ కుమార్ ని ఎంపిక చేసారు. అయన భార్యగా సుమలతను ఎంపిక చేసారు. 
ఈ సినిమాలో చిరంజీవికి ఊత పదం ‘రఫ్‌ ఆడిస్తా’. ఈ ఐడియా చిరంజీవిదే అని సమాచారం.

ఈ సినిమా శత దినోత్సవాల్ని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న హైదరాబాద్‌, విజయవాడ, ఏలూరు, తిరుపతిలో ఒకే రోజున నిర్వహించారు. విజయ్‌ మాల్యాకు చెందిన ‘డోరినార్‌’ అనే ఛార్టెడ్‌ ఫ్లెయిట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు నాలుగు ప్రాంతాలకు వెళ్లారు. ఆ రోజుల్లో ఆ ఫ్లెయిట్‌ అద్దె గంటకు రూ. 40 వేలట. మొత్తం 12 గంటలు అద్దెకు తీసుకొన్నారట . అయితే అప్పట్లో 5లక్షల రూపాయలు ఫ్లైట్ అద్దెకు కట్టారట.
ఈ సినిమాను తమిళం,హిందీ బాషలలో విడుదల చేస్తే అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది.

‘గ్యాంగ్ లీడర్’ సినిమాను సీక్వెల్ ని రామ్ చరణ్ తో చేయాలనీ చాలా మంది నిర్మాతలకు ఆలోచన ఉంది. కానీ అది ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో వేచి చూడాలి.