Movies

రాధ,విజయశాంతి,రాధిక వీరిలో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు?

తెలుగులో బాగా రాణించాక,ఇక్కడ ఆదరణ పొందాక బాలీవుడ్ లో శ్రీదేవి,జయప్రద,జయసుధ రాణించారు. వాళ్ళ అసమాన నటన అలాంటిది. ఇక్కడ వీరి ముగ్గురికి విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ముగ్గురు తర్వాత వచ్చిన తరంలో విజయశాంతి,రాధ,రాధికా కీలకమైన హీరోయిన్స్ అని చెప్పాలి. చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్,నాగార్జున తదితరుల సరసన గ్లామర్ ఒలకబోస్తూ ,నటనను కూడా కురిపించారు. ఇంకా చెప్పాలంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.

విజయశాంతి కేవలం 15ఏళ్ళ వయస్సులో కళ్ళుకుల్లి ఇదం అనే తమిళ మూవీ ద్వారా వెండితెరకు పరిచయం అయింది. భారతీరాజా డైరెక్షన్ లో నటనలు మెళుకువలు నేర్చుకున్న విజయశాంతి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరుగాంచింది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తారాస్థాయికి చేరిన విజయశాంతి మొదట్లో గ్లామర్ పాత్రలు,పాటలకు పరిమితం అయినప్పటికీ తర్వాత నటనకు ప్రాధ్యాన్యత గల సినిమాలు ఎంచుకుని తన సత్తా చాటింది. ముఖ్యంగా టి కృష్ణ విజయశాంతిలోని నటనను గుర్తించాడు. వందేమాతరం,నేటి భారతం, ప్రతిఘటన,వంటి సినిమాలు ఆమె కెరీర్ ని కీలక మలుపు తిప్పాయి. చిరంజీవి ,బాలకృష్ణ వంటి వాళ్ళతో సినిమాలు చేసి,మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా నిల్చింది.

ఇక రాధ విషయం తీసుకుంటే,టాలీవుడ్ లో అందమైన తారల్లో రాధ ఒకరు. ఈమె కూడా తమిళంలోనే కెరీర్ మొదలు పెట్టింది. పైగా భారతీరాజా డైరెక్షన్ లోనే కావడం విశేషం. అసలు పేరు ఉదయచంద్రిక. మలయాళీ అమ్మాయి అయినా టాలీవుడ్ అమ్మాయిలా స్టార్ హీరోయిన్ అయింది. దక్షిణాదిలో అన్ని భాషలు కలిపి 250చిత్రాల వరకూ చేసింది. తెలుగులో ప్రేమమూర్తులు సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ చిరంజీవితో చేసిన గుండా ఆమెకి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమాతోనే డాన్స్ క్వీన్ గా రాధకు గుర్తింపు వచ్చింది. దొంగ,పులి,రక్తసింధూరం,అడవి దొంగ వంటి మూవీస్ తో చిరు

రాధ హిట్ ఫెయిర్ అయ్యారు. అంతేకాదు బాలయ్యతోనూ రాధకు హిట్స్ ఉన్నాయి. 1981లో ఇండస్ట్రీకి వచ్చిన రాధ 1991లో పెళ్ళిచేసుకుని బయటకు వెళ్ళిపోయింది. కేవలం పదేళ్లు మాత్రమే ఇండస్ట్రీలో గల రాధ చివరి మూవీ పందిరి మంచం. ఇలా అన్ని భాషల్లో చివరి చిత్రంగా ఒక్కో మూవీ చేసింది.

కాగా తమిళ నటి అయిన రాధికా తెలుగులో కూడా ఆరోజుల్లో అగ్ర హీరోయిన్ అయింది. తమిళంలోనే కాకుండా అన్ని భాషల్లో తన నటనతో ఫాన్స్ ని సంపాదించుకున్న నటి ఈమె. ఈమె తండ్రి ఎం ఆర్ రాధా తమిళంలో నటుడు. తల్లి గీత శ్రీలంక దేశస్థురాలు. రాధికా తమిళంలో కిళక్కే పొగం రై చిత్రంద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో కమెడియన్ సుధాకర్ హీరో. నిజానికి ఆరోజుల్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో 19మూవీస్ చేసారు. పల్లెటూరి అమ్మాయిగా కనిపించే రాధికా మోడ్రన్ పాత్రల్లో కూడా రాణించింది.

తెలుగులో చిలిపి వయస్సు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రాధికా న్యాయం కావాలి,ప్రియ,పట్నం వచ్చిన పతివ్రతలు,అభిలాష వంటి మూవీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కోసారి హీరోలను కూడా డామినేట్ చేసిన సందర్భాలున్నాయి. సీరియస్ పాత్రలనుంచి కామెడీ వరకూ అన్నిరకాల పాత్రలు పోషించింది. తనతో పనిచేసిన ప్రతిఒక్కరితో సత్సంబంధాలు గల రాధికను వాళ్లంతా ఇప్పటికీ ఆమెను అభిమానిస్తారు.

ఇక విజయశాంతి,రాధ,రాధికలలో ఎవరికి వారే తమ ప్రతిభతో అగ్రస్థాయికి చేరారు. అయితే వీళ్ళలో నెంబర్ వన్ ఎవరో చెప్పడం కొంచెం కష్టమైనా,సాధారణ యాక్టర్ గా వచ్చి అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న విజయశాంతి నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పాలి.