Movies

మతం మార్చుకున్న టాప్ హీరోలు, హీరోయిన్లు వీళ్ళే

ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు,ఆచరించవచ్చు అని భారతదేశంలో ఉండడంతో మతం మార్చుకునేవాళ్ళు చాలామంది వుంటున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారు.

క్రిస్టియన్ కుటుంబానికి చెందిన దక్షిణాది స్టార్ హీరోయిన్ లిజి హిందువైన ,దర్శకుడు ప్రియదర్శన్ ని పెళ్లాడింది. తద్వారా హిందూ మతంలోకి మారడమే కాదు లక్ష్మీగా పేరు మార్చుకుంది.

ఇక ఏ ఆర్ రెహ్మాన్ సంగతి చాలామందికి తెలిసిందే. ఇతడి పేరు దిలీప్. చిన్నప్పుడు వాళ్ళ పరిస్థితుల దృష్ట్యా ఇస్లాం వైపు మొగ్గారు. ఆర్ధిక,ఆరోగ్య పరిస్థితులు మెరుగవ్వడంతో అల్లాపై నమ్మకం పెరిగింది. 1989నుంచి మతం మారి, పేరును అల్లా రఖా రెహ్మాన్ గా మార్చుకున్నారు. అల్లా పెట్టిన పేరు అని ఆ పేరులోని అర్ధం.

నటి కుష్బూ కూడా పుట్టుకతో ముస్లిం అయినప్పటికీ,సుందర్ అనే హిందువుని పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటినుంచి హిందూ విశ్వాసం పెంచుకున్నారు. ఈమెపై చాలా విమర్శలు వచ్చినా నిర్ణయం మార్చుకోలేదు.

ఇక స్టార్ హీరోయిన్ నగ్మా క్రిస్టియన్ గా మారింది. నిజానికి తల్లి ముస్లిం,తండ్రి హిందువు. అయితే ఈమెకు క్రిస్టియానిటీ పై నమ్మకం ఏర్పడింది. 2007లో బాప్తిజం స్వీకరించింది.

అదే కోవలో యువన్ శంకర్ రాజా హిందూ మతం నుంచి ఇస్లాం లోకి మారాడు. తల్లి మరణం తరువాత ఇస్లాం పై నమ్మకం ఉందని ట్వీట్ చేసి,అటువైపు ఆకర్షితుడయ్యాడు.

స్టార్ హీరోయిన్ నయనతార కూడా సిరియన్ క్రిస్టియన్. అయితే చెన్నైలోని ఆర్య సమాజ్ లో శాస్త్రోక్తంగా హిందూయిజంలో కి మారింది. కాగా తమిళంలో దుమ్ము రేపిన నటి మోనికా హిందూ మతం నుంచి ఇస్లాం లోకి మారి,ఇంజి రెహిమగా పేరు మార్చుకుంది.