Movies

మేడలో పెరిగి ఎన్టీఆర్ కోసం పూరి పాక లోకి బసవతారకం ఎందుకొచ్చింది… నమ్మలేని నిజాలు

కొందరి జీవితాలు మరికొందరి కోసం అన్నట్లు ఉంటాయి. నందమూరి తారక రామారావు భార్య బసవరామ తారకం కూడా ఎన్టీఆర్ కోసమే అన్నట్లు జీవించారు. ఓ జంగమదేవర దగ్గర శివ దీక్ష తీసుకోవడం ద్వారా వీర శైవం పొందిన కొమరవోలు మునసబు కాట్రగడ్డ చెంచయ్య , కృష్ణవేణి దంపతులకు ముగ్గురు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. ఉమా మహేశ్వరరావు, బసవ రామ తారకం, రుక్మగంద వర ప్రసాదరావు,మల్లికార్జునరావు,మాలతి ఇలా ఈ ఐదుగురు సంతానంలో రెండవ సంతానంగా బసవ రామతారకం జన్మించారు. ఇక ఎన్టీఆర్ తల్లి వెంకట్రావమ్మ పెదనాన్న వెంకటరత్నం కొడుకు చెంచయ్య అన్నమాట.

వెంకట్రావమ్మ అక్కకు పిల్లలు లేకపోవడంతో చెంచయ్యను కొమరవోలు కి తీసుకెళ్లి వారసునిగా చేసుకోవడంతో ఆయనకు మునసబు గిరి వచ్చింది. ఇక చెంచయ్యను సొంత సోదరునిగా భావించి వెంకట్రావమ్మ పండగలకు,పబ్బాలకు వెళ్లివచ్చేది. అలా ప్రేమానురాగాలు ఏర్పడడంతో సంబంధం కలుపుకోవాలని భావించారు. అందుకే రెండవ సంతానంగా అమ్మాయి పుట్టడంతో ఎన్టీఆర్ పేరు కల్సి వచ్చేలా బసవ రామ తారకం అని పేరు పెట్టారు. అలా పుట్టినప్పుడే ఇద్దరు భార్య భర్తలుగా ఎన్టీఆర్, బసవతారకం అయ్యారన్నమాట.

ఇక కల్లాకపటం ఎరుగని గంగిగోవు లాంటిది బసవతారకం. అందంతో పాటు మనసు కూడా అందంగా గల బసవ తారకం చిన్నప్పుడు చదువుతో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. చెంచయ్య ఇంట మునసబు కూతురిగా అల్లారుముద్దుగా పెరిగి,నందమూరి ఇంట పూరిపాకలో ఉంటూ కష్టాలను కూడా చిరునవ్వుతో స్వీకరించిన ఇల్లాలు బసవతారకం.

ఆమెకు ఎన్టీఆర్ తప్ప మరోలోకం లేదు. ఆయనకు కూడా ఆమె తలపే తప్ప మరొకటి ఉండేది కాదు. అయితే ఆమె మరణంతో ఎన్టీఆర్ ఒంటరితనం భరించలేక పోయాడు. ఇక గంపెడు సంతానం ఉన్నప్పటికీ ఒక్కరుకూడా ఆయన గదిమెట్లు ఎక్కడానికి సాహసం చేయలేదు. మేమున్నాం అంటూ సంతానంలో ఎవరైనా చేయి అందించివుంటే,ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చేది కాదు. ఎన్టీఆర్ జీవితంలో చీకటి అధ్యాయం ఉండేదికాదు.