Health

క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆహారం తీసుకొనే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దురలవాట్లను వదిలేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలి. దాని కోసం సంవత్సరానికి ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ క్యాన్సర్‌ను ముందుగానే కనిపెడుతూ ఉండాలి.
తాజా కూరగాయలు, పళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
ప్రాసెస్డ్‌ ఫుడ్‌, చక్కెరలు,నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
శీతల పానీయాలు మానేయాలి. తాజా పండ్ల రసాలను త్రాగటం అలవాటు చేసుకోవాలి.
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడు శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది.
వంశపారంపర్యంగా క్యాన్సర్‌ సంక్రమించే అవకాశాలున్నవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఏ అనారోగ్య లక్షణమైనా మూడు వారాలకు మించి తగ్గకపోతే క్యాన్సర్‌ అయి ఉండొచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.
ఎంత త్వరగా క్యాన్సర్‌ను గుర్తిస్తే, చికిత్స, చికిత్సకయ్యే ఖర్చు అంత త్వరగా, తక్కువగా ఉంటుంది. నివారణ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.