ఇండస్ట్రీలో వారసులుగా ఎంట్రీ ఇచ్చే కూతుళ్ల రేంజ్ వామ్మో… ఎలా ఉందో చూడండి
ఒకప్పుడు సినీ హీరోల వారసులుగా కూతుళ్లు వచ్చేవారు కాదు. కేవలం కొడుకులే ఎంట్రీ ఇచ్చేవారు. ఒకవేళ కూతుళ్లు వస్తుంటే ఫాన్స్ కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఎంచక్కా హీరోల కూతుళ్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అదికూడా తమిళంలో ఎక్కువ గా కనిపిస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వెనక్కి వెళ్తే బాలయ్య హీరోగా వచ్చిన టాప్ హీరోలో సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ గా వేయాల్సి వుంది. అయితే ఫాన్స్ నుంచి వ్యతిరేకత రావడంతో ఆమె వెనక్కి వెళ్ళిపోయింది.

ఆతర్వాత నీలకంఠ మూవీ షో తో తన నటనను చూపించింది. ఆతర్వాత కూడా తెలుగులో ఇలాంటి వారసులుగా కూతుళ్లు రావడం తక్కువే. లేటెస్ట్ గా మెగా ఫామిలీ నుంచి నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక మనసుతో ఆడియన్స్ ముందుకు వచ్చింది.వెబ్ సీరీస్ తో ఆకట్టుకున్నాక హీరోయిన్ గా వచ్చింది. నాగసౌర్య హీరోగా వచ్చిన ఈమూవీలో నిహారికకు మంచి మార్కులు పడ్డా సినిమా ఆడలేదు.

అయితే అప్పుడప్పుడు మంచి పాత్రలు దొరికితే చేస్తోంది. ఇటీవల తమిళంలో ఓ సినిమాలో యాక్ట్ చేసిన నిహారిక కు మంచి పేరు వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సూర్యకాంతం సినిమాలో ఈమె నటిస్తోంది. కాగా జెమిని గణేశన్ కూతురు రేఖ బాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్ళింది. ఇక కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ తెలుగు,తమిళ తదితర భాషల్లో నటిస్తూ ఇండస్ట్రీని ఎలేస్తోంది.

ఈమె నటించిన గబ్బర్ సింగ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా తెలుగులో నిలిచింది. అందుకే ఈమెకు తెలుగులో మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. మొదట్లో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడినా, ఆతర్వాత వీరలెవెల్లో దూసుకెళ్తోంది.

అలాగే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన సర్కార్ సినిమాలో తళుక్కున మెరిసిన వరలక్ష్మి,ఆతర్వాత మాధవన్,విజయ్ సేతుపతి నటించిన మల్టీస్టారర్ మూవీ విక్రమ్ వేదా లోనూ మంచి పాత్రతో తన సత్తా చాటింది. తెరమీదే కాకుండా తెరవెనుక కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ తండ్రికి తగ్గ తనయగా నిలుస్తోంది.

అలాగే ఒకే ఒక్కడు యాక్షన్ హీరో అర్జున్ కూతురు ఐశ్వర్య సైతం హీరోయిన్ గా చేస్తూ తండ్రి పేరు నిలబెడుతోంది. ఇక తాజాగా తమిళ నాట ఒకనాటి హీరో అరుణ్ పాండ్యన్ వారసురాలిగా అతడి కూతురు కీర్తి పాండ్యన్ ఎంట్రీ ఇస్తోంది.

1990దశకంలో కొన్ని డబ్బింగ్ మూవీస్ ద్వారా తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన అరుణ్ పాండ్యన్ గుర్తుండే ఉంటుంది. స్టార్ హీరోల కూతుళ్లు వరుసగా ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో హరీషన్ డైరెక్షన్ లో దర్శన్ హీరోగా వస్తున్న మూవీలో కీర్తి పాండ్యన్ హీరోయిన్ గా చేస్తోంది. అరుణ్ పాండ్యన్ కూడా ఈ మూవీలో కీరోల్ పోషిస్తున్నట్లు చెబుతున్నారు. మరి ఈమూవీతో కీర్తి పాండ్యన్ ఎలాంటి స్టార్ డమ్ తెచ్చుకుంటుందో చూడాలి.

