మజిలీ హీరోయిన్ దివ్యాన్ష కౌశిక్‌ గురించి నమ్మలేని నిజాలు

రంగుల ప్రపంచం సినీ ఇండస్ట్రీ ఎందరినో రమ్మంటుంది. తనలో ఇముడ్చుకుంటుంది. వాళ్ళ దశను బట్టి నిలబడతారో ఫట్ అవుతారో ఉంటుంది. ఇక తాజాగా తెలుగులో హిట్ టాక్ తో దూసుకెళ్తున్న మజిలీ సినిమా ద్వారా దివ్యాన్షా కౌశిక్ పరిచయం అయింది. తెలుగులో ఎంట్రీతోనే హిట్ అందుకున్న ఈ భామకు ఆలియా భట్,కరీనా కపూర్,అనుష్క శర్మ,టాలీవుడ్ లో సమంత అంటే ఇష్టపడే ఈమె సమంతతో కల్సి తెలుగు సినిమాలో నటించడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయకుమార్,రణవీర్ కపూర్ అంటే ఈమెకు చాలా ఇష్టం.కొత్త అందాలను చూడ్డానికి ఆడియన్స్ ఉత్సాహం చూపడం వలన సినిమాల్లో హీరోయిన్స్ తరచూ మారిపోతుంటారు.

రెండు మూడు సినిమా తర్వాత కొత్త హీరోయిన్ ఉంటే  తప్ప చూడరు. ఇలా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన దివ్యాన్షా ముద్దు పేరు దివ. 1997ఫిబ్రవరి 10న ఉత్తరాఖండ్ లో జన్మించిన ఈ భామ చిన్నతనం అంతా ఢిల్లీలో గడిచింది. స్కూల్ డేస్ నుంచి నటన మీద ఆసక్తి గల ఈమె ముంబయికి మకాం మార్చి నటనలో ట్రైనింగ్ అయింది. నటనలో శిక్షణ పొందుతున్న సమయంలో వర్క్ షాప్స్ లో పాల్గొంది. అలా చిన్న చిన్న యాడ్స్ చేస్తూ ఆతర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ ,హీరో హోండా బైక్ వంటి యాడ్స్ లో చేసింది. ఆతర్వాత సినిమాల్లో నటించాలన్న కోరికతో ఆడిషన్స్ కి వెళ్ళింది. ప్రస్తుతం తమిళంలో హీరో సిద్ధార్థతో ఓ సినిమా చేస్తున్న ఈ భామ తర్వాత నాగచైతన్య పరిచయంతో మజిలీలో నటించే ఛాన్స్ కొట్టేసింది. మొదటిసారిగా మజిలీ విడుదలైంది. తమిళ సినిమా జూన్ లో విడుదల కానుంది. తెలుగులో ఎంట్రీతోనే హిట్ కొట్టిన ఈ భామ ఇంకా ఎలాంటి సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.