Movies

“మహర్షి” ప్రీ రిలీజ్ తో మహేష్ అభిమానులకు సర్ప్రైజ్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకతంలో తెరకెక్కుతున్న తాజా సినిమా “మహర్షి”. మహేష్ 25వ సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన పాటలు మరియు టీజర్లను ఇప్పటికే మహేష్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.అయితే ఎప్పుడు తన ఆడియో కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ ఇతర హీరోల కన్నా కాస్త భిన్నంగా చేయడం అలవాటు.

మహేష్ 25వ సినిమా కావడంతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని చిత్ర బృందం ప్రీ రిలీజ్ కు మహేష్ మరియు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులకు ఒక సర్ప్రైజ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మహేష్ తో సినిమాలు చేసిన దర్శకులు అందరు ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కానున్నారట.ఇది మాత్రం మహేష్ అభిమానులకు ఊహించని గిఫ్ట్ అనే చెప్పాలి.ఈ చిత్రంలో మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."