Movies

రేటు విషయంలో కొండెక్కిన శర్వానంద్…ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

ఏ హీరో అయినా,హీరోయిన్ అయినా మార్కెట్ లో రేంజ్ బాగున్నప్పుడే రెమ్యునరేషన్ కూడా వీలైనంత ఎక్కువగా దండుకోవాలన్న రూట్ లో వెళుతున్నారు. అది చిన్న హీరో అయినా, పెద్ద హీరో అనే తేడా లేదు. ఇక ప్రస్తుత కుర్ర హీరోల్లో శర్వానంద్ కు మంచి మార్కెట్ వుంది. అయితే దాన్ని అడ్డంపెట్టుకుని మరీ భయంకరమైన రేట్ కోట్ చేసే, పరిస్థితి మాత్రం లేదు. అయితే ఇందుకు భిన్నంగా శర్వా రేటు విషయంలో కొండ ఎక్కి కూర్చున్నట్లు టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం రెండు కొత్త సినిమాలకు గీన్ సిగ్నల్ ఇచ్చిన శర్వా నంద్, అగ్రిమెంట్ లు మాత్రం కుదుర్చుకోలేదు.

ఒప్పుకున్న సినిమాల్లో 14 రీల్స్ సినిమా ఒకటి. అయితే, ఈ సినిమాకు శర్వానంద్ రెమ్యూనరేషన్ కింద కోట్ చేసిన మొత్తం అక్షరాలా ఎనిమిది కోట్లు అని టాక్ వచ్చింది. ఈ రేటు విని 14 రీల్స్ జనాలు గుభేల్ మన్నారని టాక్.అయితే ఇప్పటికే ఫినిష్ చేసిన సుధీర్ వర్మ సినిమాకు నాలుగు కోట్లు పుచ్చుకున్నాడు.ఆ మధ్య డిజాస్టర్ అయి పడిపడి లేచె మనసుకు ఆరుకోట్లు తీసుకున్నాడు. అలాంటిది, ఇప్పుడు ఏకంగా ఎనిమిది కోట్లు అడగడం ఏమిటని టాక్ నడుస్తోంది.

అయితే దీనికి ఓ కారణం ఉందని అంటున్నారు. తమిళ ప్రొడ్యూసర్ ఎస్ ఆర్ ప్రభు ఓ ద్విభాషా చిత్రాన్ని శర్వాతో చేయడానికి వచ్చారు. దానికి ఏడో, ఎనిమిదో ఆపర్ చేసారని టాక్. ఇక శర్వా ఆ రేటుకే ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం బేరాలు సాగుతున్నాయని అంటున్నారు. మొత్తానికి రేంజ్ ఈ లెవెల్లో పెంచేసాడా అని అందరూ అంటున్నారు. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."