Movies

బాలీవుడ్ స్టార్స్ కి తెలుగు హీరోలు షాక్ ఇచ్చారా?

ది టైమ్స్‌ ప్రకటించిన ‘టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌’లో సూపర్ స్టార్ మ‌హేష్‌బాబు చోటు సాధించాడు. మహేష్ మొదటి స్థానంలో నిలవగా, ఈ జాబితాలో తెలుగు నుంచి యువసంచలనం విజయ్ దేవరకొండ, ప్రభాస్‌, రానాలు కూడా చోటు ద‌క్కించుకున్నారు. ఈ విధంగా తొలిసారి మోస్ట్ డిజైర‌బుల్ మెన్స్ లో తెలుగు హీరోలు సత్తా చాటారు. ఈ మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌ లిస్ట్‌లో ప్ర‌తి ఏడాది టాప్ లో నిలిచే బాలీవుడ్‌ అగ్ర కథానాయకులు అమీర్‌ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌లకు ఈసారి స్థానం లేకుండా పోయింది. కానీ హృతిక్‌, రణ్‌వీర్‌ సింగ్‌, విక్కీ కౌశల్‌కి ఇందులో స్థానం దొరికింది. ఇక విజయ్ దేవరకొండ నాల్గవ ర్యాంక్‌, ప్రభాస్‌ 12వ ర్యాంక్‌, రానా 19వ ర్యాంక్‌ సంపాదించారు. ఈ జాబితాలో గతంలో మాదిరి సీనియర్లని కాకుండా కొత్త‌వారిని, యువ నటులనే మాత్రమే ఎంపిక చేసి, ప్ర‌త్యేక లిస్ట్ ని తీసుకొచ్చారు. 

అందులో భాగంగా 2019కి చెందిన జాబితాలో మహేష్ తోపాటు ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రానా నిలిచి బాలీవుడ్ అగ్ర హీరోల‌కు షాక్ ఇచ్చారు. ఇటీవల మహర్షి తో మహేష్‌బాబు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయినా మంచి కలెక్షన్లని వసూలు చేస్తోంది. త్వరలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ వినోదాత్మక చిత్రం చేయాలని డిసైడ్ అయ్యాడు. ప్ర‌భాస్‌ సాహోతో రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పీరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ చేస్తున్నారు. రానా ప్ర‌స్తుతం ‘1945’, ‘హిరణ్యకశ్యప’, ‘హాథి మేరీ సాథి’, ‘విరాటపర్వం’, ‘హౌస్‌ఫుల్‌ 4స వంటి చిత్రాల్లో న‌టిస్తూ, బిజీ బిజీగా ఉన్నాడు. ఇక విజ‌య్ తెలుగు హీరోల‌కు కూడా షాక్ ఇచ్చాడు. బాహుబ‌లితో దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన ప్ర‌భాస్‌, రానాల‌ని కూడా విజ‌య్ వెన‌క్కి నెట్ట‌డం మామూలు విషయం కాదు. 

విజ‌య్‌కి ద‌రిదాపుల్లో కూడా ప్ర‌భాస్, రానాలు లేరు. దీంతో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్ర‌స్తుతం డియ‌ర్ కామ్రేడ్‌లో న‌టిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నారు. స‌రికొత్త మ్యాన‌రిజ‌మ్‌, డైలాగ్ డెలివ‌రీ, తెలంగాణ యాస‌లో మాట్లాడ‌టం వంటివ‌న్నీ తెలుగు ఆడియెన్స్ కి కొత్తగా, ఓ ఫ్రెష్ ఫీలింగ్‌నిచ్చాయి. అందుకే ఆడియెన్స్ విజయ్ ని విశేషంగా ఆదరిస్తూ,విజ‌య్ సినిమాల‌కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అలాగే ఆనంద్ అన్న‌మ‌లై డైరెక్ష‌న్‌లో హీరో సినిమాలో నటించబోతున్నాడు. క్రీడా ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రంలో విజ‌య్ బైక్ రేస‌ర్‌గా కనిపిస్తాడట. ఈ మూవీ ఈనెల 20న ప్రారంభం కానుంది.