MoviesUncategorized

కృష్ణ – విజయనిర్మల పెళ్లికి సాక్షులు ఎవరో తెలుసా?

అనారోగ్య కారణంతో మృతి చెందిన నటి, దర్శకురాలు, నిర్మాత విజయ నిర్మల మరణంతో తెలుగు సినిమా పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. విజయ నిర్మల మూవీ ఆర్టిస్టు అసోషియేషన్ కోసం ముఖ్యంగా వ్యక్తిగతంగా ఎంతో మందికి కూడా ఆమె లేదనకుండా కాదనకుండా సాయం చేశారు. ఇప్పుడు వారంతా కూడా ఆమె మరణంతో దుఖంలో మునిగిపోయారు. విజయనిర్మల అన్నయ్యగా భావించే ప్రముఖ నటుడు చంద్రమోహన్ ఆమె మరణం గురించి మీడియాతో మాట్లాడుతూ కుమిలి పోయారు. ‘విజయ నిర్మల, నేను కలిసి మొదటి సారిగా ‘రంగుల రాట్నం’ చిత్రంలో నటించాం. అందులో నాకు చెల్లిగా విజయనిర్మల నటించింది. అప్పటి నుండి ఆమెను నేను నా సొంత చెల్లిగా భావించేవాడిని. ఆమె కూడా నన్ను సొంత అన్నగా భావించి సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా మెలిగేవాళ్లం” అని వివరించారు.

విజయ నిర్మల స్థాపించిన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ లో నేను కాని కృష్ణ కాని మాత్రమే నటించే వాళ్లం. కృష్ణ బిజీగా ఉన్న సమయంలో నాతో సినిమాలు తీసేది. ఇక విజయ నిర్మల దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో నటించా. ప్రతి సినిమాలో కూడా నాకు చాలా మంచి అవకాశాలు ఇచ్చింది’అని చెప్పుకొచ్చారు. ఫిల్మ్ నగర్ లో ఇద్దరం కూడా ఎదురు ఎదురుగా ఇళ్లు తీసుకున్నామని చంద్రమోహన్ చెప్పారు. విజయ నిర్మల – కృష్ణ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నాకు చెప్పారు. నేను కృష్ణ మేకప్ మన్.. విజయ నిర్మల అసిస్టెంట్ ఇంకా మోహన్ కృష్ణ అనే జర్నలిస్ట్ కలిసి తిరుపతిలో వారి పెళ్లి చేశాం’అని చెప్పారు.

వారి పెళ్లికి మేము నలుగురం మాత్రమే సాక్షులం. కృష్ణ – విజయ నిర్మలల పెళ్లికి ముందు ఎప్పుడైనా కలిసి మాట్లాడుకోవాలనుకుంటే నా బ్యాచులర్ రూంకు వచ్చే వారు. నాకు కృష్ణ విజయనిర్మల అప్పటి నుండి చాలా క్లోజ్. నేను ఎంతో మంది హీరోయిన్స్ తో నటించాను. హీరోలతో కలిసి చేశాను కాని వీరిద్దరితో ఉన్నంత సాన్నిహిత్యం మరెవరితో లేదని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి మరణం నాకు తీరని ఆవేదన మిగిల్చింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు. 

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."