రోజు 3 లవంగాలను తింటున్నారా….ఈ 5 నిజాలను తెలుసుకోకపోతే నష్టపోతారు

cloves in telugu :మిర్టేసి కుటుంబానికి చెందిన లవంగాలను ప్రాచీన కాలం నుండి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. లవంగాలు అనేవి ఒక చెట్టు మొగ్గ. లవంగం చెట్టు నుండి పూసినా పువ్వును బాగా ఎండబెడితే లవంగాలు తయారవుతాయి. తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి.ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బాంగ్లాదేశ్, బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పాకిస్తాన్, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు.లవంగాలు  వంటకాలకు మంచి సువాసన రుచినీ ఇస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పుల  వల్ల వచ్చే రుగ్మతలకు లవంగం మంచి మందులా పని చేస్తుంది.

ఈ లవంగాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని వాడటం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరుతాయి. లవంగాలలో ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మంగనీష్, విటమిన్ లు ఎ, సి, ఉంటాయి .లవంగాలలో ‘యూజెనాల్’ అని పిలువబడే ముఖ్యమైన సమ్మేళనము ఉంటుంది.  ఇది శరీరంలో స్వేచ్చగా సంచరిస్తూ శరీర కణాలను నష్టపరిచే ఫ్రీ రాడికల్స్ ని  అడ్డుకోవడం ద్వారా సహజ ప్రతిక్షకారిణి వలె పనిచేస్తుంది. అంతేకాక కాలేయ పనితీరు బాగుండేలా చేయటం మరియు కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన మంచి  కొవ్వును అందించటం మరియు కాలేయంలో ఏర్పడే మంటను తగ్గించటానికి సహాయాపడుతుంది. 

రోజువారీ ఆహారంలో లవంగాలను భాగంగా చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మాంగనీస్ లో ఉండే మినరల్స్ మెదడు పనితీరును మెరుగుపరచి వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ రాకుండా చేయటమే కాకుండా జ్ఞాపకశక్తి పెరిగేలా చేస్తుంది. లవంగాలలో యాంటీమైక్రోబయాల్ లక్షణాలు ఉండుట వలన తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి వాటికి కారణం అయిన బ్యాక్టీరియాను నివారిస్తుంది. లవంగాలు మధుమేహం నియంత్రణలో చాలా బాగా సహాయపడుతుంది. లవంగాలలో ఉండే ‘నైలిసిసిన్’ అనే సమ్మేళనం రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. నైలిసిసిన్ అనేది మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు ఒక గ్లాస్ నీటిలో 6 లవంగాలను వేసి బాగా మరిగించి వడకట్టి ఆ కషాయాన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు త్రాగుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే తేడా కనిపిస్తుంది.