Healthhealth tips in telugu

వారంలో 2 సార్లు తాగితే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా ఈ సీజన్ లో…

Mint Coriander Curry Leaves Juice : ఈ రోజుల్లో ఏ సమస్యలు లేకుండా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ డ్రింక్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కణజాలం దెబ్బతినకుండా కాపాడుతుంది.

అలాగే ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. మన శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఈ డ్రింక్ కోసం పుదీనా,కొత్తిమీర,కరివేపాకు ఉపయోగిస్తున్నాం. మిక్సీ జార్ లో గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, గుప్పెడు కరివేపాకు ఆకులు, ఒక కప్పు నీటిని పోసి మిక్సీ చేయాలి.

ఈ మిశ్రమాన్ని గ్లాస్ లోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం, కొంచెం ఉప్పు వేసి తాగాలి. ఉదయం సమయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు. కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడేంట్స్ శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. కొత్తమీరలో అధికంగా ఉండే విటమిన్ కె ఎముకలు బలంగా ఉండటానికి దోహదం చేస్తుంది.
Health Benefits Of Eating Pudina
పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సమృద్దిగా ఉండుట వలన ఈ సీజన్ లో వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలర్జీని, ఉబ్బసాన్ని దూరంచేసే ఔషధ లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి.
curry leaves
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, వివిధ రకాల ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ యూరిన్ , బ్లాడర్ సమస్యలను తగ్గిస్తాయి. ఇందులో అధిక మోతాదులో ఉండే ఐరన్ శరీరంలోని రక్తకణాలకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.