Devotional

Bathukamma Day 4: నాలుగోరోజు ‘నానబియ్యం బతుకమ్మ’

ఇక బతుకమ్మ పండుగలో నాలుగో రోజు ‘నానబియ్యం బతుకమ్మ’గా బతుకమ్మను కొలుస్తారు. ఈ రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు. నానబియ్యాన్ని ఫలహారంగా పెడతారు. వాయనంగా నానబోసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చెక్కరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు.