Devotional

Bathukamma Day3: మూడోరోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’

బతుకమ్మ పండుగలో మూడో రోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’గా బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి.. తామర పాత్రల్లో అందంగా అలంకరిస్తారు. శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం అందరూ కలసి ‘బతుకమ్మ’ ఆడతారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేస్తారు. మూడోరోజు వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చక్కర, బెల్లం కలిపి పెడతారు.