Business

ఆ యాడ్‌ కోసం మహేష్‌ ఫ్యామిలీ ఎంత తీసుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…???

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో చాలా సరదా సమయంను గడుపుతూ ఉంటాడు.నెలలో ఖచ్చితంగా ఒక్కసారైనా ఫారిన్‌ ట్రిప్‌ వేయడం మనం చూస్తూనే ఉంటాం.యాడ్స్‌ సినిమా షూటింగ్‌ ఇంత బిజీగా ఉండే మహేష్‌ బాబు కుటుంబ సభ్యులతో ఎలా సమయం గడుపుతున్నాడా అంటూ అంతా ఆశ్చర్యపోతారు.

ఈసారి యాడ్‌ షూటింగ్‌ కోసం ఏకంగా తన కుటుంబంను మొత్తం తీసుకు వచ్చాడు.మహేష్‌ చాలాకాలంగా సాయి సూర్య డెవలపర్స్‌ కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాడు.ఆ కంపెనీ కొత్త యాడ్‌ కోసం మహేష్‌ బాబు తన కుటుంబ సభ్యులందరితో కలిసి నటించాడు.మహేష్‌ బాబు తన భార్యతో ఈ యాడ్‌ చేస్తే పర్వాలేదు.కాని ఫ్యామిలీ మొత్తానికి తీసుకు రావాల్సిన అవసరం ఏంటీ డబ్బు కోసం మహేష్‌బాబు వారిని కూడా వినియోగించుకోవాలా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే పిల్లలు సరదాగా నటించారే తప్ప వారు డబ్బు కోసం కాదని మహేష్‌ బాబు సన్నిహితులు అంటున్నారు.
వారు సరదాగా నటించినా కూడా వారికి దక్కాల్సిన పారితోషికం వారికి దక్కింది.సాదారణంగా మహేష్‌ బాబు ఒక యాడ్‌లో నటిస్తే రెండున్నర నుండి మూడు కోట్ల వరకు తీసుకుంటాడు.

ఈ యాడ్‌ కు గాను మహేష్‌ బాబు ఫ్యామిలీ మొత్తం కలిసి అయిదు కోట్ల వరకు తీసుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఈ యాడ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో సాయి సూర్య డెవలపర్స్‌ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి పోయింది.

ఈ వీడియోలను మరియు ఫొటోలను సదరు కంపెనీ రెండు సంవత్సరాలు ఉపయోగించుకోవచ్చు.త్వరలో మరో యాడ్‌లో కూడా ఈ ఫ్యామిలీ అంతా కలిసి నటించాల్సి ఉంటుంది.ఇలా రెండు సంవత్సరాల ఒప్పందంకు గాను అయిదు కోట్లు అంటూ సమాచారం అందుతోంది.ఇంతకు మించి ఉండే అవకాశం కూడా ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు.