Movies

నా పేరు మీనాక్షి సీరియల్ నుండి క్రిష్ ఎందుకు తప్పుకున్నాడో తెలుసా?

ఈ టీవిలో సక్సెస్ గా రన్ అవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ లో లీడ్ రోల్ లో క్రిష్ నటిస్తున్నాడు. క్రిష్ అసలు పేరు మధుసూదన్. ఈ సీరియల్ లో క్రిష్ చనిపోయినట్టుగా చిత్రీకరించారు. అయితే మధుసూదన్ పేస్ బుక్ లైవ్ లోకి వచ్చి ఇక నుంచి నా పేరు మీనాక్షి సీరియల్ లో నటించటం లేదని అభిమానులకు చెప్పాడు. ఎందుకంటే ఈ సీరియల్ లో నేను నటిస్తే డైరెక్టర్ గారు ఈ సీరియల్ ని చేయను అని అన్నారు. డైరెక్టర్ గారి లైఫ్ పాడుచేయటం ఇష్టం లేక ఈ సీరియల్ నుండి నేనే బయటకు వచ్చేసా అని చెప్పాడు మధుసూదన్.

మధుసూదన్ పరిశ్రమకు వచ్చి దాదాపుగా 13 సంవత్సరాలు అయింది. తన చెప్పుతూ ఒకరి దగ్గర తల దించుకొని పనిచేయటం నచ్చదని,నేను నాలాగే ఉంటాను అని చెప్పాడు. ప్రస్తుతం మధుసూదన్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కథలో రాజకుమారి సీరియల్ లో నటిస్తున్నారు. మీరు నా సీరియల్ చూడాలని అనుకుంటే కథలో రాజకుమారి సీరియల్ చూడండి. మరల నేను కొత్త ప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తాను. నా పేరు మీనాక్షి సీరియల్ లో నన్ను అడక్కుండా నా ఫోటో పెట్టి దండ వేశారని సీరియల్ టీం ని తప్పు పట్టారు.