Movies

RRR కోసం రామ్ చరణ్,ఎన్టీఆర్ లను సెలక్ట్ చేయటానికి అసలు కారణం ఇదే

సినిమా ఇండస్ట్రీలో ఆడియన్స్ నాడి పసిగట్టి,సినిమాలు తీసేవాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. కొందరు లక్కుగా కొట్టేస్తారు. కొందరు ప్లానింగ్ తో ఉంటారు. ఇలా ఆడియన్స్ నాడితెల్సి,పక్కా ప్లాన్ తో మూవీస్ తీయడంలో ఎస్ ఎస్ రాజమౌళి దిట్ట. అందుకే ప్రపంచం గర్వించే బాహుబలి లాంటి సినిమా తీశాక రాజమౌళి నుంచి ఎలాంటి సినిమా ఆడియన్స్ ఆశిస్తారో ఇట్టే చెప్పేయొచ్చు. అందుకే జక్కన్న తీస్తున్న భారీ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.

ఇద్దరు టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లను పెట్టి, రాజమౌళి తీస్తున్న ఈ మూవీ కోసం ఇప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. టాలీవుడ్ లో అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉన్న నందమూరి మెగా ఫ్యామిలీలను కలపడం ద్వారా రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను ఎంపిక చేసుకోవడం, అదీ ఎన్టీఆర్, రాంచరణ్ లే ఎందుకు ఎంపిక అయ్యారన్న ప్రశ్నకు తాజాగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

గతంలో తారక్ తో మూడు సినిమాలు చేశానని, రాంచరణ్ తో మగధీర తీశానని రాజమౌళి తెలిపారు. కాబట్టి వీరి పని విధానం, వర్క్ కంఫర్ట్ గా ఉంటుందనే వీరిద్దరినీ ఎంపిక చేశానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, టాలీవుడ్ స్టార్ హీరోలలో వీరిద్దరూ మంచి మిత్రులని కూడా రాజమౌళి చెప్పాడు. వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా పండుతుందనే వారిద్దరిని హీరోలుగా తీసుకున్నానని రాజమౌళి వివరించాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా వస్తోంది. అయితే లాక్ డౌన్ తో షూటింగ్ వాయిదా పడడంతో ఇంటికి పరిమితం అయ్యారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."