Movies

లాక్ డౌన్ సమయంలో రియల్ హీరోయిన్ అనిపించుకున్న ప్రణీత ! ఏం చేసారో తెలుసా ?

కరోనా వైరస్ లాక్ డౌన్ వేళ తారలు తమవంతు సహాయం గా ఎవరికి వారు స్వచ్చందంగా సహాయం చేస్తూ మానవత్వం చాటుకున్నారు.అటు బాలీవుడ్ నుంచి ఇటు టాలీవుడ్ వరకు ఎవరి శక్తి మేరకు వాళ్ళు సహాయం చేసారు..కొందరు ధనం రూపంలో సహాయం చేస్తే మరికొందరు రోజు వారి కూలీలకు ఆహారం అందించే సహాయం చేస్తున్నారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 5000 రూ వరకు ఇచ్చారు.

ఇక పోతే కరోనా వైరస్ నేపథ్యం లో సహాయం చేయడానికి హీరోయిన్స్ లో ముందుగా వచ్చి సహాయం చేసింది మాత్రం ‘ప్రణీత సుభాష్’ గారే అని చెప్పాలి.తనకు అప్పుడు ఎప్పుడో అత్తారింటికి దారేది, రభస తరువాత మళ్ళీ పెద్దగా తెలుగు లో చెప్పుకోతగ్గ సినిమాలు ఏవి రాలేదు అనే చెప్పాలి.తన వంతు గా శక్తికి మించి సహాయం చేసారు ప్రణీత సుభాష్. రీసెంట్ గా పేద ప్రజలకోసం ఆమె ఫుడ్ తయారు చేయించి పంపిణి చేసారు. వీటికి సంభందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .అందులో తనే స్వయంగా వంట వండుతున్న వీడియో కూడా ఉంది.

వీటిని చూసిన నెటిజెన్స్ ఆమెపై ఎన్నో ప్రశంసలు గుప్పిస్తున్నారు.లాక్ డౌన్ కారణంగా కేవలం ఇంటి వరకే పరిమితం అవ్వకుండా సామాజిక సేవ చేస్తూ..అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రణీత.ఇది ఇలా ఉండగా కరోనా నేపథ్యం లో సినీ కార్మికుల కోసం చిరంజీవి సీసీసీ (కరోనా క్రైసిస్ ఛారిటీ) ని ప్రారంబంచిన సంగతి తెలిసిందే.