Movies

ప్రభాస్ కొత్త సినిమా హాస్పిటల్ సెట్‌ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో…?

ప్రభాస్ 20 వ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో 5 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన హాస్పిటల్ సెట్‌ ను నిర్మిస్తున్నారట. హాస్పిటల్ సెట్‌ ను నాలుగు అంతస్తులుగా నిర్మిస్తున్నారు.

దీనిలో ఐసియు వార్డ్, ప్రత్యేక వార్డ్, జనరల్ వార్డులు మరియు డాక్టర్ రూమ్స్ ఉన్నాయట. ఈ సెట్ లో దాదాపుగా నెల రోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి ‘రాధే శ్యామ్’ అని టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారు. ఇంకా టైటిల్ ని ఫైనల్ చేయలేదు. పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తారట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."