Movies

మేకప్ లేని ఈ స్టార్ హీరొయిన్ ని గుర్తు పట్టారా…అయితే చూడండి

తెలుగులో మహానటి సినిమాతో ఎక్కడలేని స్టార్ డమ్ సొంతం చేసుకున్న మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట అనే చిత్రంలో కూడా నటించేందుకు ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. కీర్తి సురేష్ తమిళం, కన్నడ, తెలుగు తదితర భాషలకు సంబంధించిన ఐదు చిత్రాల్లో నటిస్తోంది. అలాగే తెలుగులో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న అటువంటి రంగ్ దే అనే చిత్రంలో నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ తెలుగులో స్రవంతి రవి కిషోర్ తీసిన నేను శైలజ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఆ ఫోటోలు ఒకసారి పరిశీలిస్తే, షూటింగ్ పూర్తయిన అనంతరం కీర్తి సురేష్ మేకప్ తీసేసి వెళుతున్న సమయంలో కొందరు క్లిక్ మనిపించి సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేశారు.

కొందరు మాత్రం మేకప్ లేకపోయినా సరే కీర్తి సురేష్ చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్స్ అయితే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ హీరోయిన్లు లేదా మరే ఇతర మహిళలైనా మేకప్ వేసుకుంటేనే బాగుంటారని అంటున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."