Movies

అల్లు అర్జున్ కి ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలమో…పాపం

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన ‘గంగోత్రి’ సినిమాతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన టాలెంట్ తో స్టైలిష్ స్టార్ అయ్యాడు. నిజానికి ఆ సినిమా చూసాక అందరూ నెగిటివ్ కామెంట్స్ చేసారు. అయితే తర్వాత సినిమా ‘ఆర్య’ కోసం తన లుక్ మార్చేసిన బన్నీ.. నెగిటివ్ కామెంట్స్ చేసిన వారి నోటే వావ్ అనిపించేలా చేసాడు. ఇక ‘బన్నీ’ సినిమాతో ఫ్యాన్స్ ‘స్టైలిష్ స్టార్’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చేసారు. అప్పటి నుంచి సినిమా సినిమాకి తన యాక్టింగ్ తో పాటు లుక్స్ పరంగా కూడా చేంజెస్ చూపిస్తూనే ఉన్నాడు. ‘దేశముదురు’ సినిమా కోసం లాంగ్ హెయిర్ తో కనిపించడంతో పాటు సిక్స్ ప్యాక్ బాడీ కూడా మైంటైన్ చేసి, ‘పరుగు’ ‘ఆర్య 2’ ‘వరుడు’ ‘వేదం’ ‘బద్రీనాథ్’ సినిమాలలో పాత్రకు తగ్గ లుక్స్ చూపాడు.

అంతేకాదు… జులాయి’. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ,’రేసుగుర్రం’ సినిమాలతో యూత్ మొత్తం తన స్టైల్ ని అనుకరించేలా చేసాడు. ఇక ‘సరైనోడు’ సినిమాలో ఒత్తుగా ఎదిగిన మీసకట్టుతో కనిపించాడు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా కోసం కంప్లీట్ మిలిటరీ గెటప్ లోకి వెళ్ళిపోయాడు. తాజాగా మొన్న సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాలో మళ్ళీ మరో కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా కోసం బన్నీ కంప్లీట్ లుక్ చేంజ్ చేసాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా కోసం ఊర మాస్ లుక్ లోకి మారిపోయాడు. మొరటు కుర్రాడిగా, లారీ డ్రైవర్ గా కనిపించడం కోసం ఒత్తుగా ఉంగరాల జుట్టు, గుబురు గడ్డం కూడా పెంచేసాడు.

ఇప్పటికే ‘పుష్ప’ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ లో బన్నీని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అడవుల్లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకోవాల్సిన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకునేలోపు కరోనా మహమ్మారి బ్రేక్స్ వేసింది. దీంతో ఇప్పటికే నాలుగు నెలల సమయం వేస్ట్ గా పోయింది. బన్నీ మాత్రం అదే లుక్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు.ఇటీవల సతీమణితో కలిసి వాకింగ్ చేస్తూ కనిపించినప్పుడు.. లేటెస్టుగా మార్నింగ్ వాక్ చేస్తున్నా అని బన్నీ పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే అతను ‘పుష్ప’ కోసం అదే గెటప్ లో ఉన్నాడని అర్థం అవుతోంది. ఇంతకముందు కంటే ఎక్కువ గడ్డంతో కనిపిస్తున్నాడు. అయితే షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఐడియా లేకపోవడంతో అల్లు అర్జున్ ఇన్ని నెలలైనా అదే గెటప్ లో ఉంటాడట. ఏదైనా బన్నీ స్టయిలే వేరుకదా.