Movies

టాప్ 5 తెలుగు సీరియల్స్ ఇవే…మీరు చూస్తున్నారా…మిస్ కాకండి

Top 5 telugu serials :కరోనా వైరస్ కారణంగా థియేటర్లు ఇంకా తెరవక పోవడంతో సీరియల్సే ఎక్కువగా చూస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆడవాళ్ళతో పాటు మగవారు కూడా సీరియల్స్‌కి అభిమానులు అయ్యారు.దాంతో ఇప్పుడు ఇంకా సీరియల్స్ బాగా నడుస్తున్నాయి. అందులో బాగా ఆకట్టుకుంటున్న సీరియల్స్ పరిశీలిస్తే, ఒకప్పుడు చక్రవాకం, మొగలిరేకులు సీరియల్ ఏ రేంజ్‌లో వెళ్ళాయో ఇప్పుడు కార్తీకదీపం సీరియల్ టాప్ టీఆర్పీతో నడుస్తోంది. గత రెండేళ్లుగా బుల్లితెరపై సూపర్ హిట్ సీరియల్ గా కార్తీకదీపం నిలిచింది. అందుకే ఒకే కథను ఇన్ని రోజుల నుంచి సాగదీస్తున్న అభిమానులు మాత్రం మా వంటలక్క అంటూ టాప్‌లోనే పెట్టారు. ఎక్కడైనా ఎపిసోడ్ మిస్సయితే చాలు కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారట.

ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎంతో ఉత్కంఠంగా నడుస్తోంది. ఈ సీరియల్ లోని విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్త, మామ, భర్త, కొడుకులు, కోడలు, పిల్లలు అంటూ తిరిగే గృహలక్ష్మి జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. భర్త మరో ఆమెతో ఉండడం అందుకు పిల్లలు సపోర్ట్ చెయ్యడం, తర్వాత వారు తల్లి విలువ తెలుసుకోవడం ఇలా ఎన్నో ఆసక్తికర ఘటనలతో ఉత్కంఠ రేపుతోంది. దాదాపు 400 ఎపిసోడ్‌ల కు చేరువ అవుతున్న వదినమ్మ ‌ సీరియల్‌లో ఒక సమస్య తీరిందనుకునే సమయానికి మరో పెద్ద సమస్య వస్తూ ఉంటుంది.

సమస్య వచ్చిన అందరూ సంతృప్తి పడేలా ఏదో ఒక పరిష్కారం తీసుకొచ్చి ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇక ఇటీవల ప్రారంభమైన దేవత సీరియల్‌ ఉత్కంఠంగా కొనసాగుతోంది. ప్రారంభంలో ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్లలకు సపోర్ట్ ఇచ్చే అత్తలా కనిపించి తర్వాత ఆమెలో స్వార్థం కనిపిస్తోంది. ఇటు భర్త ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఆమెను దూరం పెట్టడం వంటి ఆసక్తికర అంశాలతో నడుస్తోంది. ఇక సవతి తల్లి కూతురంటే, చెల్లి పెళ్లి కోసం మతిస్థిమితం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్న ‘చెల్లెలి కాపురం’ సీరియల్ ఆసక్తిగానే నడుస్తోంది. తను పెళ్లాడిన వ్యక్తిని మార్చడానికి ప్రయత్నం చేసే అక్క భూమి పాత్ర పేరుకు తగ్గట్టుగా భూదేవి అంత ఓర్పు తో నటిస్తోంది. భర్తను చిన్నపిల్లాడిలా చూసుకుంటూ అతని చుట్టూ ఉన్న సమస్యలను దూరంచేస్తుంది.