Movies

ఇంటిగుట్టు సీరియల్ హీరో సౌర్య గురించి కొన్ని నమ్మలేని నిజాలు

Inti guttu serial shourya :తెలుగు టివి రంగంలో సీరియల్స్ హవా మామూలు రేంజ్ లో లేదు. చాలా ఇళ్లల్లో సీరియల్ టైం కి టివి దగ్గర వాలిపోతున్నారు. ఇందులో జీతెలుగులో ప్రసారమయ్యే కుటుంబ కథా సీరియల్ ఇంటిగుట్టు ఎప్పటికప్పుడు రహస్యాలను ఛేదిస్తూ సాగిపోతోంది. అందరిని అలరిస్తోన్న ఈ సీరియల్ లో హీరో సౌర్య తన నటనతో , అందంతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాడు.

ఇతడి అసలు పేరు రోహిత్ రంగస్వామి ఫిబ్రవరి 8న బెంగుళూరులో జన్మించాడు. ప్రభుత్వ స్కూల్లో పాఠశాల విద్య, సైన్స్ అండ్ కామర్స్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన రోహిత్ కి చిన్ననాటి నుంచి నటన అంటే ఆసక్తి. జిమ్ కి వెళ్లడం ఇష్టం. చదువు పూర్తికాగానే రోహిత్ కన్నడ నాట సీరియల్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. బంగారి, సంఘర్షణ , కావేరి,అవలు వంటి పలు కన్నడ సీరియల్స్ లో చేసాడు.

నెగెటివ్, పాజిటివ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని రోహిత్ తెచ్చుకున్నాడు. ప్రణయని సీరియల్ లో నటిస్తున్న చందు బి గౌడ చేస్తున్న లక్ష్మి వరమ్మ అనే కన్నడ సీరియల్ లోను, అలాగే ఆమెకథ సీరియల్ లో రాణి పాత్ర చేస్తున్న మేఘన ఖుషి చేస్తున్న అవలు అనే కన్నడ సీరియల్ లోను రోహిత్ నటించాడు. ఇతడి భార్య పేరు గాయత్రీ గౌడ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్నారు. ఇంటిగుట్టు సీరియల్ ద్వారా తెలుగులో తొలిసారి చేస్తున్న రోహిత్ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు.