హ్యాపీ డేస్ హీరోని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

Happy Days Vamsi Krishna :2007 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాలో వంశీ కృష్ణ నటించాడు. వంశీ కృష్ణ హ్యాపీ డేస్ సినిమాలో శంకర్ క్యారెక్టర్ వేసాడు. కాగా వంశీ.. హ్యాపీడేస్ సినిమా తర్వాత కరోనా వైరస్, వంగవీటి చిత్రాలతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. క్రాక్ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించాడు .

హ్యాపీ డేస్ నటుడు వంశీ క్రాక్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించడంతో క్రాక్ ఆడియో వేడుకకు విచ్చేసి యాంకర్ సుమపైనే పంచ్‌లు వేసి నవ్వులు పూయించాడు. అలాగే రవితేజలాగే నేను ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చానని.. రవితేజతో వర్క్ చేస్తే చాలా ఎనర్జీ వస్తుందని.. లోపల ఒకటి పెట్టుకుని బయటకి ఒకటి మాట్లాడరని తన స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు వంశీ.