మోనాల్ ఏడవడానికి అసలు కారణం చెప్పేసింది…అదేనట…?

bigg boss Monal :ఇటీవల ముగిసిన బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 4లో కంటెస్టెంట్ గా చేసిన మోనాల్ గ‌జ్జ‌ర్ ఇప్పుడు సినిమాలో కూడా మెరుస్తోంది. అవును బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ అల్లుడు అదుర్స్ లో మోనాల్ స్పెషల్ సాంగ్ చేసింది. అయితే ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో మోనాల్ గజ్జ‌ర్ ఏడ్చేసిందట. బిగ్‌బాస్ హౌజ్‌లో ఉన్న‌ప్పుడు క్రై బేబిగా గుర్తింపు తెచ్చుకున్న మోనాల్, అల్లుడు అదుర్స్ సెట్స్‌లోనూ ఏడిచిన‌ట్లు మూవీ యూనిట్ చెప్పడంతో తాజాగా జరిగిన ఆడియో ఫంక్ష‌న్‌లో యాంకర్ సుమ క‌న‌కాల‌ ఈ విషయాన్నీ ప్రస్తావించారు.అసలు ఎందుకు ఏడ్చావంటూ మోనాల్‌ని సుమ ప్ర‌శ్నించారు.

దీనికి మోనాల్ స్పందిస్తూ .. డిసెంబ‌ర్ 30న నేను షూటింగ్‌లో పాల్గొన్నానని, నిజానికి ఆ రోజు మా నాన్న చ‌నిపోయిన రోజు కావడంతో అది గుర్తు వ‌చ్చి ఒక్కసారిగా క‌న్నీళ్లు వ‌చ్చాయ ని అసలు విషయం వెల్లడించింది. సినిమాలో త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చిన వారికి థ్యాంక్స్ అని మోనాల్ చెప్పారు. డీఎస్పీ సంగీతంలో డ్యాన్స్ చేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంద‌ని, ఇప్పుడు త‌న‌కు అవ‌కాశం వ‌చ్చింద‌ని పేర్కొంది. ఈ అవ‌కాశం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాన‌ని కూడా చెప్పింది.

బెల్లంకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా సాంగ్ లో మోనాల్ చాలా క‌ష్ట‌ప‌డ్డారని అన్నారు. ఇక ద‌ర్శ‌కుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ కోసం ఏడు రోజులు మోనాల్ క‌ష్ట‌ప‌డింద‌ని ప్ర‌శంసించారు. మూడు రోజులు రిహార్స‌ల్స్ చేసి, నాలుగు రోజులు షూటింగ్‌లో పాల్గొంద‌ని తెలిపారు. కాగా న‌భా న‌టేష్, అను ఇమ్మాన్యుల్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో ప్ర‌కాష్ రాజ్, సోనూసూద్, బ్ర‌హ్మాజీ, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీలక పాత్ర‌ల్లో నటించారు. ఈ సినిమా సంక్రాంతి బెయిల్ నిలవబోతోంది.