ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్ ఏమిటో తెలుసా ?

Ntr favoruite Food :నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. టెంపర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ అరవింద సమేత వంటి సినిమాలతో వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతూ రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమా చేస్తున్నాడు. సినీ కెరీర్ మొదట్లో ఎన్టీఆర్ చాలా లావుగా ఉండే వాడు.

యమదొంగ సినిమా సమయంలో లైపో చేయించుకుని దాదాపుగా 30 కేజీల బరువు తగ్గాడు. అప్పట్నుంచి బరువు పెరగకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఎన్టీఆర్ కి అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం అయితే షూటింగ్ లేని సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇంట్లో వంట చేస్తూ ఉంటాడు.ntr రొయ్యల బిర్యానీతో పాటు నాటుకోడి కూర, వేపుడులను ఎంతో ఇష్టంగా తింటారు.