ముఖంపై నల్లమచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి?

Black Spots remove Tips :దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల ముఖం మీద జిడ్డు పేరుకుపోతుంది. దీనిని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోకపోతే మొటిమలు అవుతుంటాయి.

మొటిమల స్థానంలో మచ్చలు ఏర్పడుతుంటాయి. అందుకని రోజుకు రెండు, మూడు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.

నిమ్మ తొక్కల పొడిని పచ్చిపాలలో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తుంటే మొటిమలు, వాటి తాలూకు నల్లమచ్చలు తగ్గుతాయి. ముఖం కాంతివంతం అవుతుంది.

ఒక బౌల్ లో ఆర స్పూన్ నిమ్మరసం, కొంచెం గ్లిజరిన్ వేసి కలిపి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాస్తే మంచి ఫలితం కనపడుతుంది.

గోరింటాకు పేస్ట్ లో పసుపు కలిపి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాస్తే తొందరగా తగ్గుతాయి.

ఎండిన తులసి ఆకులను పొడిచేసి దానికి వేపాకు పొడి, పుదీనా పొడి, పసుపు, రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లాగా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై రాస్తే నల్లమచ్చలు మాయమవడమే కాకుండా చర్మం మెరుపును సంతరించుకుంటుంది.

ఎండిన తమలపాకులను పొడి చేసి దానికి కొబ్బరి నూనె కలిపి మచ్చలపై రాయాలి.

నల్లని మచ్చలను తగ్గించటంలో సిట్రస్ జాతి పండ్లు బాగా సహాయపడతాయి. నిమ్మరసంలో కాటన్ ముంచి మచ్చల మీద రాసి మసాజ్ చేయాలి.

మచ్చలు ఉన్న ప్రదేశంలో తేనె రాసిన మంచి ఫలితం కనపడుతుంది.