నెలకు 2లక్షలు.. ట్రాఫిక్ జామ్ ను cash చేసుకున్నాడిలా .

Gaurav vada pav :థానే కు చెందిన గౌరవ్ ముంబయి వెళ్తూ 4 గంటలపాటు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయాడు. అపుడు ట్రాఫిక్ జామ్ లో బఠాణీలు అమ్ముతున్న కురాడిని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇలా ట్రాఫిక్ జామ్ లో వడా పావ్ అమ్మితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందే తడవుగా 35000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగం కు రాజీనామా చేసేసాడు. అంతకు 10ఏళ్ళ ముందు Pizza delivery boy గా పనిచేసిన అనుభవం ఉంది కూడాను. పైగా చాలాసార్లు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఆకలి బాధ అనుభవించాడు.

గౌరవ్ తల్లి వడా పావ్ చాలా రుచిగా చేస్తుంది. మొదట తల్లి వడ పావ్ చేస్తే, అతని భార్య ప్యాక్ చేసేది. మొదట కొన్ని రోజులు అమ్మడం కష్టం అయినా, అమ్మడం లో ఫ్రెండ్స్ సాయం తీసుకున్నాడు. వడాపావ్ ప్యాక్ తో ఒక చిన్న వాటర్ బాటిల్ ను జతపరచి 20రూపాయలకు ట్రాఫిక్ జామ్ లో అమ్మడం నెమ్మదిగా క్లిక్ అయింది. ఆ తరువాత ఒక షాప్ అద్దెకు తీసుకుని ‘ట్రాఫిక్ వడాపావ్’ పేరుతో బిజినెస్ ప్రారంభించి, 6వేలు జీతం తో 8 మంది delivery boys ను పెట్టుకుని, ఈ రోజు నెలకు 2లక్షలు సంపాదిస్తున్నాడు.