సెంట్ మెంట్ కి భయపడుతున్న హీరోలు…ఎందుకో చూడండి

Tollywood Heroes And Their Sentiments :సెంటిమెంట్స్ అందరికీ ఉంటాయి. అందునా సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ మరీ ఎక్కువగా ఉంటాయి. టైటిల్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకూ అన్నీ సెంటిమెంటే. ఇక కొందరు హీరోలు హిట్స్ లేక ఇబ్బందులు పడుతూ పోలీస్ డ్రెస్ వేసుకుని హిట్స్ కొట్టారు. అవేమిటో చూడండి. బృందావనం మూవీతో హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆతర్వాత శక్తి, ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్యా, రభస లాంటి మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. అయితే పూరి జగన్నాధ్ తీసిన టెంపర్ సినిమా మలుపు తిప్పింది పోలీసాఫీసర్ గెటప్ తో తారక్ చేసిన నటనకు ఫాన్స్ ఖుషీ అయ్యారు. ఇక అక్కడ నుంచి వరుస విజయాలు తారక్ ఖాతాలో పడుతున్నాయి.

ఇక పూరి జగనాధ్ తీసిన పోకిరి మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన మహేష్ బాబు ఆతర్వాత సైనికుడు, అతిధి, ఖలేజా వంటి ప్లాప్స్ చూసాడు. దీంతో శ్రీను వైట్ల తీసిన దూకుడుతో మళ్ళీ హిట్ ఖాతాలో కి వెళ్ళాడు. ఇందులో కూడా పోలీసాఫీసర్ క్యారెక్టర్ వేసాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా తర్వాత పులి,తీన్ మార్ వంటి మూవీస్ తో డిజాస్టర్స్ చూసాడు. ఇలాంటి సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కొట్టి హిట్ ట్రాక్ లోకి పవన్ వచ్చేసాడు. ఇందులో కూడా పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడం విశేషం.

ఎస్ ఎస్ రాజమౌళి ఇచ్చిన బిగ్గెస్ట్ హిట్ తర్వాత రామ్ చరణ్ కి అంతటి రేంజ్ లో సినిమా రాలేదు. హిట్స్ రాకపోవడంతో తమిళ రీమేక్ ద్రువతో చెర్రీ లైన్ లో పడ్డాడు. ఇందులో రామ్ చరణ్ పోలీసు పాత్ర వేయడం గ్రేట్. ఇక అల్లు అర్జున్ దేశముదురు తర్వాత చాలాకాలం ప్లాప్ లు వెంటాడడంతో త్రివిక్రమ్ అందించిన జులాయి మూవీటి హిట్ ట్రాక్ లోకి వచ్చేసాడు. తర్వాత రేసుగుర్రం సూపర్ హిట్ అయింది. ఇందులో బన్నీ పోలీసాఫీసర్ గా కన్పిస్తాడు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ వరుస పరాజయాలు చూసాడు. ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తీసిన క్రాక్ మూవీ తో రవితేజ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇందులో రవితేజ పోలీసాఫీసర్ గా అదరగొట్టాడు.