కీరవాణి తన కొడుకుల కెరీర్ ఎలా ప్లాన్ చేశాడో…!?

Keeravani sons :వారసత్వం అన్ని రంగాలలో సహజం. అయితే దానికి గట్టి పునాది కూడా ఉండాలి. లేదంటే తేడా కొట్టేస్తుంది. టాలెంట్ ఉన్నా, అదృష్టం కూడా కల్సి రావాలి. కానీ ప్రయత్నం గట్టిగానే ఉండాలి. అందుకే తమ కెరీర్ మాదిరిగా తమ వారసులను ఇలాగే నిలబెట్టాలని భావిస్తారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ ధోరణి మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో వారసులు ఎంట్రీ ఇస్తున్నారు. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది మహామహులు తమ వారసులను ఎంట్రీ ఇప్పించినా సక్సెస్ ఫుల్ గా రాణించేది కొందరే. సినిమా హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది తమ వారసులను ప్రవేశ పెడుతున్నారు.

నందమూరి, అక్కినేని, చిరంజీవి, ఘట్టమనేని ఇలా హీరోలే కాదు, కమెడియన్స్, టెక్నీషియన్స్ కూడా తమ వారసులను ప్రవేశపెడుతున్నారు. అక్కినేని అఖిల్ , అల్లు శిరీష్ , మంచు మనోజ్ వంటి స్టార్ హీరోల వారసులు ఇంకా నిలబడలేదు. అలాగే ఎంతోమంది హీరోలను స్టార్లు గా మార్చిన పూరి జగన్నాథ్ కూడా తన తమ్ముడు సాయిరామ్ శంకర్ ను హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నించి సక్సెస్ కాలేదు. ఇక తన కొడుకు ఆకాశ్ కి కూడా బ్రేక్ ఇవ్వలేకపోయాడు. సక్సెస్ కాని జాబితా ఇలా చాలా ఉంటుంది అయితే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాత్రం తన ఇద్దరు కొడుకుల కెరీర్ కి మంచి పునాది వేసాడు.

పెద్ద కొడుకు కాలభైరవ సింగర్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత సంగీత దర్శకుడిగా రూపాంతరం చెంది, తొలి చిత్రం ‘మత్తు వదలరా’తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘కలర్ ఫోటో’ నిలబెట్టింది. ఈ సినిమా పాటలు అందరినీ అలరించాయి. ప్రస్తుతం కాలభైరవ చేతిలో 3,4 సినిమాలున్నాయి. ఇందులో ఏ రెండు సినిమాలు సక్సెస్ అయినా చాలు. ఇక ‘మత్తువదలరా’ సినిమాతో పెద్ద కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఇటు చిన్న కొడుకు సింహా హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు ‘తెల్లవారితే గురువారం.’ భిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ కాకుండానే.. ప్రణీత్ అనే షార్ట్ ఫిలిం దర్శకుడు తీసే ‘బాగ్ సాలే’ అంటూ డిఫరెంట్ సినిమా అనౌన్స్ చేశాడు.