భారీగా పెంచేసిన రెమ్యునరేషన్….ఎంతంటే…?

Krithi Shetty remuneration :ఒక సినిమా హిట్ అయితే క్రేజ్ వచ్చేస్తుంది. అదే ప్లాప్ అయితే ఎవరూ దగ్గరికి కూడా రారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న రీతిలో హీరో హీరోయిన్స్ వ్యవహరిస్తూ, సినిమా హిట్ అయితే తర్వాత సినిమా ల నుంచి రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్నారు. ఈ విషయంలో కొత్తా పాత అనే తేడా లేదు. తాజాగా బుచ్చిబాబు సానా డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తూ హీరోగా ఉప్పెన మూవీ తీసాడు. ఈ మధ్య రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.

ఇక ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది . సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఈ అమ్మడికి బాగా కల్సి వచ్చింది. ఎందుకంటే, 17 ఏళ్ల వయసులోనే మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చేసుకున్న కృతిశెట్టి భవిష్యత్తులో మరిన్ని నటన ప్రాధాన్యత పాత్రలను సెలెక్ట్ చేసుకుంటే, తెలుగు ప్రేక్షకులు ఈ హీరోయిన్ తమ మదిలో ముద్ర వేసుకుంటారు. అయితే ఇక ఈ భామకు సంబంధించి ఓ వార్త వైరల్ అయింది.

అది కూడా ఈ అమ్మడి రెమ్యునరేషన్ గురించి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఉప్పెన సినిమాకు 6 లక్షల పారితోషికం తీసుకున్న ఈ కృతి శెట్టి, ఇప్పుడు సైన్ చేయబోయే సినిమాలకు ఏకంగా పదిరెట్లు అంటే 60 లక్షల పారితోషికం డిమాండ్ చేస్తోందట. ఒక్క సినిమా హిట్ కొడితేనే ఇంత దారుణంగా రెమ్యునరేషన్ పెంచేస్తే ఎలాగని సినిమా వర్గాలు వాపోతున్నాయి. తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అయితే కోటి రూపాయల డిమాండ్ చేసినా ఆశ్చర్య పోనవసరం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.