టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సూపర్ స్టార్ మనవడుని గుర్తు పట్టారా…?
Galla ashok New Movie : టాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ సినిమా ఇండస్ట్రీలో వారసత్వం నిరంతరాయంగా సాగిపోతోంది. ముఖ్యంగా స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి వారసుల ఎంట్రీ ఈమధ్య మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయాల్లో మాదిరి సినిమాలో కూడా ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరు ముగ్గురు ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఆయన ఇమేజ్ తో ఇప్పటికి డజను మంది హీరోలు వచ్చారు. తాజాగా మెగాస్టార్ తన బాబాయ్ అంటూ కొణెదల పవన్ తేజ్ అనే కుర్రాడు కూడా హీరోగా వచ్చాడు.
అక్కినేని,నందమూరిఫ్యామిలీల నుంచి కూడా ఎక్కువమంది వచ్చినా నిలబడింది తక్కువే. ఇక సూపర్ స్టార్ కృష్ణ నటవారసులుగా గతంలో రమేష్ బాబు వచ్చి, కొన్ని సినిమాల తర్వాత ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక దూరమయ్యాడు. ప్రస్తుతం సినిమాలు వదిలేసి వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అయితే కృష్ణ రెండో కొడుకు మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చి దుమ్ము రేపుతున్నాడు. సూపర్ స్టార్ హోదాతో వెలిగిపోతున్నాడు. అయితే ఇదే ఫ్యామిలీ నుంచి కొత్తగా ఎంట్రీ పడింది. నిజానికి మహేష్ బాబు బ్రాండ్ ఇమేజ్ తో అతని బావ సుదీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి, తనకంటూ సొంత ఇమేజ్ తో నిలదొక్కుకునే యత్నం చేస్తున్నాడు.
అయితే తాజాగా మహేష్ బాబు పెద్ద సోదరి, బావ ఎంపీ గల్లా జయదేవ్ వారసుడు గల్లా అశోక్ సూపర్ స్టార్ మహేష్ బ్రాండ్ ఇమేజ్ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబులకి కౌబాయ్ గెటప్ ఓ ఇమేజ్ తెచ్చింది. ఇప్పుడు గల్లా అశోక్ కూడా కౌబాయ్ గెటప్ ఎంచుకున్నాడు. ఈ లుక్ మహేష్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఇతడిని ఫాన్స్ ఎంతవరకూ ఆదరిస్తారో ఏమో గానీ, భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా అశోక్ ని లాంచ్ చేయడానికి ఎంపీ గల్లా జయదేవ్ నిర్మాత అవతారం ఎత్తాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది.