ఈ ఫోటోలోని స్టార్ హీరోయిన్ లను గుర్తు పట్టారా…?

keerthy suresh and kalyani priyadarshan :హలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ ఆతర్వాత మరి కొన్ని తెలుగు సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె పుట్టినరోజు కావడంతో కొన్ని పిక్స్ వైరల్ అయ్యాయి. చిన్నప్పటి ఫోటోలు కావడంతో పాటు అందులో ఇంకో నటి కూడా ఉండడంతో ఆసక్తిగా మారింది. ఆమె ఎవరో కాదు మహానటి తో స్టార్ డమ్ తెచ్చుకున్న కీర్తి సురేష్.

వాస్తవానికి నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కీర్తి సురేష్ తొలి సినిమాతోనే సక్సెస్ సాధించడంతో పాటు ఆ తరువాత మరిన్ని విజయాలను నమోదు చేసుకుంది. చిన్నప్పుడు కళ్యాణి, కీర్తి సురేష్ కలిసి దిగిన ఫోటోను కీర్తి సురేష్ షేర్ చేయడంతో వీరిద్దరూ చిన్ననాటి ఫ్రెండ్స్ గా చెప్పకనే చెప్పినట్లైయింది.

కాగా తెలుగులో కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని కళ్యాణి ప్రియదర్శన్ తమిళ,మలయాళ సినిమాల్లో మాత్రం దూసుకెళ్తోంది. అయితే కీర్తి తెలుగు, తమిళ సినీ ఆఫర్లతో బిజీగా మారింది. ఇక కళ్యాణి ప్రియదర్శన్ కంటే కీర్తి సురేష్ వయస్సులో ఒక సంవత్సరం పెద్దదట. కీర్తి,కళ్యాణి అరుదైన ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు కామెంట్స్ తో అదరగొట్టేస్తున్నారు.