చెరుకు రసంతో ఇలా చేస్తే మెరిసే ముఖం మీ సొంతం

sugarcane juice Benefits in Telugu :చెరుకు రసం అంటే ఇష్టపడనివారు అంటూ ఎవరూ ఉండరు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వేసవి కాలంలో తాగుతూ ఉంటారు చెరుకు రసంలో మెగ్నీషియం,పొటాషియం,ఐరన్,కాల్షియం, ప్రోటీన్స్, విటమిన్స్, ఎలక్ట్రో లైట్స్, కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో సహాయ పడతాయి ఇవి మనలో చాలామందికి తెలిసిన విషయాలే. అయితే చెరుకు రసం మొటిమలు తగ్గించడానికి, ముఖం మీద జిడ్డు తొలగించడానికి మృతకణాలు తొలగించటానికి సహాయపడుతుంది.

దీని కోసం ఒక బౌల్లో ఒక స్పూన్ చెరుకు రసం ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసి పదినిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మొటిమలు అన్ని మాయం అవుతాయి.

చెరుకు రసం లో చిటికెడు పసుపు వేసి ముఖానికి రాసి పదినిమిషాలయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి ఈ విధంగా చేయడం వలన ముఖంపై మృతకణాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది