సీరియల్స్ నుండి అర్దాంతరంగా తప్పుకున్న నటీనటులు

Tv serial Actors :గత ఏడాది నుంచి కరోనా దెబ్బకు ఇండస్ట్రీలో చాలా ఒడిడుకులు వస్తున్నాయి. మళ్ళీ సీరియల్స్ నడుస్తున్నాయి. కొన్ని పాపులర్ సీరియల్స్ నుంచి కొందరు హీరో హీరోయిన్స్, నటులు తప్పుకోవడం సహజంగానే హాట్ టాపిక్ అయింది.సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో హీరోగా నటించిన చందన కుమార్ తప్పుకున్నాడు. స్టార్ మాలో వదినమ్మ సీరియల్ లో శివ పార్వతి కొన్ని కారణాల వలన తప్పుకున్నారు.

ఈటీవీలో ప్రసారమవుతున్న యమలీల ఆతర్వాత సీరియల్ లో వజ్రకు కూతురుగా నటిస్తున్న వైజూష కి ముందు మహేశ్వరీ నటించి, తప్పుకుంది. అలాగే అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు సీరియల్ లో చైత్రా రాయ్ హీరోయిన్ గా నటిస్తూ తప్పుకుంది. జి తెలుగులో ప్రసారమవుతున్న కల్యాణవైభోగమే సీరియల్ లో హీరోగా నటించిన సన్నీ సడన్ గా తప్పుకున్నాడు. ఇంటిగుట్టు సీరియల్ లో నటిస్తున్న రోహిత్ రంగస్వామి ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడు.

బంగారు పంజరం హీరో రాజన్ విన్సెన్ట్ నటించారు. ఆయన్ని మార్చేశారు. ప్రేమ ఎంత మధురం సీరియల్ లో మానస పాత్రలో నటిస్తున్న వర్ష కు కరోనా సోకడంతో ఈ పాత్రలో ఎవరు నటిస్తారోనని చర్చ మొదలైంది. స్టార్ మా లో ప్రసారమవుతున్న కేరాఫ్ అనసూయ సీరియల్ లో హీరో ప్రజ్వల రవి హఠాత్తుగా తప్పుకున్నాడు. ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చాడు