అర గ్లాస్ తాగితే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు 100శాతం రోగనిరోదకశక్తి పెరుగుతుంది.ఇది నిజం
immunity booster drink In Telugu :ఇప్పుడు ఉన్న పరిస్థితికి బ్రేక్ వేసేందుకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఒక మంచి మార్గం. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగటానికి ఒక అద్భుతమైన డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ తయారుచేయటం సులభమే. అలాగే మనం ఉపయోగించే ఇంగ్రిడియన్స్ అన్ని మన వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండేవే.కాకపోతే దీని కోసం పది నిమిషాల సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిందంటే చాలు దగ్గు,జలుబు వంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే సీజన్ మారినప్పుడు కూడా దగ్గు,జలుబు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అవి వస్తేఒక పట్టాన తగ్గవు. వీటిని వెంటనే తగ్గించుకోవాలి. ప్రతి చిన్న విషయానికి మందుల మీద ఆదారపడకూడదు. కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి దానిలో గ్లాసున్నర నీటిని పోసి దానిలో తిప్పతీగ కాడ చిన్న ముక్కలు మూడు వేయాలి. ఆ తర్వాత ఒక తిప్పతీగ ఆకును వేసి ఆ తర్వాత చిన్న అల్లం ముక్క,ఒక స్పూన్ సొంపు వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించి ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి 3 నిమిషాలు మరిగించి వడకట్టి ప్రతి రోజు అరగ్లాసు తాగితే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.