వైరస్ తో పోరాటం చేయాలంటే అసలు మనం తినాల్సినవి ఏమిటి?

immunity food for covid :కరోనా మహమ్మారిని తరిమికొట్టటానికి మన శరీరాన్ని ఒక ఆయుదంగా మలుచుకోవాలి. అందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకుంటే ఇమ్మునిటీ పెరుగుతుంది. మనం వైరస్ తో పోరాటం చేయాలంటే అసలు ఏమి తినాలి. శాఖాహారులు ఏమి తినాలి. మాంసాహారులు ఏమి తినాలి. అసలు ఏమి తినకూడదు వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.

శాఖాహారుల విషయానికి వస్తే పెసరపప్పు,మినపప్పు వంటివి తినాలి. వీటిల్లో 24 శాతం ప్రోటీన్ ఉంటుంది. అలాగే బొబ్బర్లు,శనగలు రాజ్మా వంటివి తీసుకోవాలి. వీటిల్లో ప్రోటీన్ తో పాటు విటమిన్ బి, ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. ఇక మాంసాహారుల విషయానికి వస్తే మాంసం,గుడ్లు,సీ ఫుడ్, రెడ్ రైస్ తీసుకోవాలి. వీటిల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.

అలాగే విటమిన్ సి సమృద్దిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది జలుబు,ఫ్లూ,జ్వరం,గొంతు ఇన్ ఫెక్షన్ వంటి వాటిని తగ్గిస్తుంది. విటమిన్ సి బత్తాయి,నారింజ వంటి పుల్లని పండ్లలో లభిస్తుంది.

విటమిన్ kఅనేది అనవసర కణాల నిర్మూలనలో కొత్త ఆరోగ్యకరమైన కణాల పుట్టుకలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. విటమిన్ k అనేది ఆకుకూరలు,గుడ్లు,బ్రోకలిలో ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ D అనేది మన శరీరానికి రావాలంటే మన శరీరానికి సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి. ఇది చికెన్ లివర్,గుడ్డు పచ్చసోన,మటన్ లివర్ లో ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ A అనేది పాలకూర,చేపలు,బొప్పాయిలలో ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ E అనేది బాదం.గుమ్మడి గింజలు,సన్ ఫ్లవర్ ఆయిల్ ,సోయా బీన్ ఆయిల్, వేరుశనగ నూనెలో ఎక్కువగా ఉంటుంది.

ఇప్పటివరకు తినే ఆహారం గురించి తెలుసుకున్నాం. ఇక ఇపుడు తినకూడని ఆహారం గురించి తెలుసుకుందాం. నిల్వ చేసిన పదార్ధాలు తినకూడదు. ఫ్రీడ్జ్ లో పెట్టిన పదార్ధాలకు కూడా దూరంగా ఉండాలి. నూనె పదార్ధాలు,జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణం అయ్యే పదార్ధాలను తీసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గిపోకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు రోజులో ఎక్కువ నీటిని తాగాలి.