1987 నుంచి బాలకృష్ణ సంక్రాంతి సినిమాలు…ఎన్ని హిట్…!?

Bala Krishna Hit Movies :మంగమ్మగారి మనవడు సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ విభిన్న సినిమాలతో మాస్ హీరోగా ఎదిగాడు. పండుగల్లో బాలయ్య సినిమాలు సందడి చేస్తాయి. ఇక సంక్రాంతి సమయంలో బాలయ్య సినిమాలు ఎలాంటి ప్రభావం చూపాయో పరిశీలిస్తే, 90శాతం సక్సెస్ అందుకున్నాడని చెప్పాలి. 1987జనవరి 14న భార్గవరాముడు మూవీ రిలీజయింది. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయశాంతి హీరోయిన్. మందాకినీ కూడా నటించింది. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్స్ తెచ్చిన ఈ మూవీ షిఫ్ట్ ల మీద 100డేస్ పూర్తిచేసుకుంది. ఆతర్వాత ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో బాలయ్య నటించిన ఇన్స్పెక్టర్ ప్రతాప్ మూవీ 1988జనవరి 5న వచ్చి కలెక్షన్స్ అదరగొట్టింది. ఎబో ఏవరేజ్ అయింది. ఇందులో కూడా విజయశాంతి హీరోయిన్.

బాలయ్య నటించిన ప్రాణానికి ప్రాణం మూవీలో రజని హీరోయిన్ గా చేసింది. 1990 సంక్రాంతికి వచ్చింది. ఓపెనింగ్స్ బాగున్నా, కథ, కధనం ఆకట్టుకోకపోవడంతో నిరాశ పరిచింది. తాతినేని రామారావు దర్శకత్వం వహించగా,సత్యనారాయణ,వాణిశ్రీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 1996 జనవరి 5న వంశానికొక్కడు మూవీ రిలీజై, హిట్ గా నిల్చింది. శరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో బాలయ్య సరసన రమ్యకృష్ణ, ఆమని నటించారు. 1998జనవరి 10న రిలీజైన పెద్దన్నయ్య మూవీ లో బాలయ్య డ్యూయెల్ రోల్ చేసాడు. శరత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 45సెంటర్స్ లో 100డేస్ ఆడింది. రోజా హీరోయిన్. బ్లాక్ బస్టర్ మూవీగా నిల్చింది. ఇక 1999జనవరి 13న రిలీజైన సమరసింహారెడ్డి మూవీతో సంక్రాంతి హీరోగా బాలయ్య మారాడు.

బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం ఆకర్షణ. సిమ్రాన్,అంజలా జవేరి,సంఘవి హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీలో జయప్రకాశ్ రెడ్డి విలన్ గా చేసాడు. ఇండస్ట్రీ హిట్ గా ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేసింది. అయితే 2000 జనవరి 14న వచ్చిన వంశోద్ధారకుడు మూవీ నిరాశపరిచింది. ఇక 2001సంక్రాంతికి బాలయ్య విశ్వరూపం ప్రదర్శించాడు. బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన నరసింహారెడ్డి మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక 2002జనవరి 11న వచ్చిన సీమ సింహం ఏవరేజ్ అయింది. 20 14సంక్రాంతికి వచ్చిన లక్ష్మి నరసింహ మూవీతో మళ్ళీ హిట్ కొట్టాడు. జయంత్ సి పరాన్జీ డైరెక్షన్ లో మణిశర్మ మ్యూజిక్ తో ఈ సినిమా మంచి విజయాన్ని అందు కుంది. ఇక 2008సంక్రాంతికి వచ్చిన ఒక్క మగాడు, 2011సంక్రాంతికి వచ్చిన పరమవీర చక్ర మూవీస్ డిజాస్టర్ అయ్యాయి. 2016 సంక్రాంతికి వచ్చిన డిక్టేటర్ మూవీ ఏవరేజ్ అయింది. తర్వాత సంక్రాంతికి కె ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన జై సింహ దుమ్మురేపింది. 2019సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు నిరాశ పరిచింది.