టాలీవుడ్ హీరోస్ ఒక్క యాడ్ లో నటిస్తే ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా ?

Tollywood Heroes Ads remuneration :ఒకప్పుడు ఏమోగానీ ఇప్పటి హీరో హీరోయిన్స్ అందరూ కూడా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క యాడ్స్ లో చేస్తూ, రెండుచేతులా సంపాదిస్తున్నారు. పైగా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఓపిక ఉన్నప్పుడే సంపాదించాలన్న కాన్సెప్ట్ మన హీరోలకు బాగా కనెక్ట్ అయింది. సినిమాలలో నటించినందుకు కోట్లకు కోట్లు తీసుకునే హీరోలు యాడ్స్ కి కూడా కోట్లు తీసుకుంటున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకే ఒక్క యాడ్ లో చేసాడు. మహేంద్ర కంపెనీకి చెందిన టియువి 300కార్ కి సంబంధించిన యాడ్ లో చేసినందుకు రెండు కోట్లు అందుకున్నట్లు చెబుతుంటారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి ఒక సినిమా చేస్తూ,బిజీగా ఉంటూనే మరోపక్క యాడ్స్ లో చేస్తుంటాడు. దాదాపు 10యాడ్స్ వరకూ చేసే మహేష్ ఒక్కో యాడ్ కి రెండు కోట్లకు పైగా అందుకుంటాడని టాక్. చిన్న పిల్లల గుండె ఆపరేషన్స్ కి యాడ్స్ సొమ్ము వినియోగిస్తుంటాడు. నవరత్న హెయిర్ ఆయిల్,మలబార్ గోల్డ్,జండూ బామ్ వంటి యాడ్స్ లో చేసాడు. ఒక్కొక్క యాడ్ కి కోటి రూపాయల వరకూ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రామరాజు కాటన్, మణిపురం గోల్డ్ లోన్ వంటి యాడ్స్ లో విక్టరీ వెంకటేష్ నటించాడు. ఒక్కొక్క యాడ్ కి కోటి రూపాయల వరకూ తీసుకున్నట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ జ్యూయలర్స్ యాడ్ లో కనిపించే కింగ్ నాగార్జున కోటిన్నర వరకూ తీసుకున్నాడని టాక్. ఇంకా మరికొన్ని యాడ్స్ లో కూడా నాగ్ చేసాడు. రెబ్ బస్,క్లోస్ అప్, ఓ ఎల్ ఎక్స్ వంటి యాడ్స్ లో నటించిన అల్లు అర్జున్ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఫ్రూటీ యాడ్ లో అలియా భట్ తో కల్సి చేసినందుకు కోటిన్నర అందుకున్నట్లు తెలుస్తోంది. చెన్నై షాపింగ్ మాల్, రెక్సోనా వంటి యాడ్స్ లో చేసిన నాగచైతన్య ఒక్కో యాడ్ కి 70లక్షల వరకూ అందుకుంటున్నాడు. రిలయన్స్ ఫ్రెండ్స్, జంగ్లీ రమ్మీ వంటి యాడ్స్ చేసిన రానా ఒక్కో యాడ్ కి కోటి రూపాయలు తీసుకున్నాడని టాక్. అక్కినేని అఖిల్ హీరోగా రాకముందే యాడ్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో యాడ్ కి 50 లక్షలు అందుకున్నాడట.