విదేశీయులును పెళ్లి చేసుకున్న 8 మంది తెలుగు హీరోయిన్స్ వీరే

Tollywood Heroines Marriage : హీరోయిన్స్ చాలామంది ప్రేమించి పెళ్లిచేసుకున్నవారే. అందులో సెకండ్ మేరేజ్ చేసుకున్నవాళ్ళు ఉన్నట్టే ,ఫారినర్స్ కూడా పెళ్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇక కొందరు పెళ్లి తర్వాత కొద్దికాలానికే భర్తతో విడిపోయిన వాళ్ళూ ఉన్నారు. విదేశీయుల్ని పెళ్లాడిన మన తెలుగు హీరోయిన్స్ ని తీసుకుంటే రక్తచరిత్ర, లెజెండ్,లయన్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన రాధికా ఆప్టే 201లో బ్రిటన్ కి చెందిన బెనెడిక్ టైలర్ అనే మెజీషియన్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది.

ఠాగూర్ వంటి సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ శ్రేయ తెలుగులో ఓ వెలుగు వెలిగింది. అయితే ఛాన్స్ లు తగ్గడంతో 2018లో తన బాయ్ ఫ్రెండ్ అయిన రష్యన్ టెన్నీస్ ప్లేయర్ హేండ్రియా ను ప్రేమించి పెళ్లాడింది. దేవదాసు మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసింది. అయితే తెలుగులో మూవీస్ మానేసి బాలీవుడ్ లో బిజీ అయింది. అయితే ఈమె ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ అండ్రే రీ బోనే అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. అయితే పెళ్లయిన కొంతకాలానికే భర్తతో విడిపోయింది.

మహేష్ బాబు తొలిసినిమా రాజకుమారుడు మూవీలో హీరోయిన్ గా చేసిన ప్రీతి జింటా 2016లో అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ ఎనలిస్ట్ జీన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. శృతిహాసన్ కూడా లండన్ కి చెందిన మైఖేల్ తో ప్రేమలో ఉంది. ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనే వార్తల నేపథ్యంలో ఇద్దరూ బ్రేక్ అప్ చెప్పేసుకున్నారు. ప్రియాంక చోప్రా 2018లో అమెరికాకు చెందిన సింగర్ కం యాక్టర్ నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లాడింది. మిరపకాయ్,మిర్చి మూవీస్ తో తెలుగులో సత్తా చాటిన రిచా గంగోపాధ్యాయ ఎంబీఏ కోసం అమెరికా వెళ్లి అక్కడ క్లాస్ మేట్ ని ప్రేమించి పెళ్లాడింది.