MoviesTollywood news in telugu

గణేష్ సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…?

Venkatesh Ganesh Full Movie :కరోనా సమయంలో కూడా మెడికల్ మాఫియా ఎలా విజృంభించిందో వార్తల్లో చూసాం. అయితే ఒకప్పుడు ఇలాంటి మాఫియాలపై వచ్చిన సినిమాలు ఓ ఊపు ఊపేసాయి. అందులో ప్రధానంగా విక్టరీ వెంకటేష్ నటించిన గణేష్ మూవీ ఒకటి. ఇందులోని డైలాగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే సామాజిక అంశాలు, అవినీతి, అరాచకాలపై తక్కువ సినిమాలు వచ్చే ఇండస్ట్రీలో గణేష్ మూవీ ఓ సెన్షేషన్ అయింది.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన ఈ మూవీని తిరుపతి స్వామి డైరెక్ట్ చేసాడు. వెంకీ తన నటనతో అదరగొట్టాడు. 1998జూన్ 19న రిలీజైన ఈ మూవీ అందరిలో ఆలోచన రేకెత్తించింది. సురేష్ కృష్ణ డైరెక్షన్ లో ప్రేమ మూవీ తర్వాత ధర్మ చక్రం మూవీ చేస్తున్న సమయంలో అసిస్టెంట్ తిరుపతి స్వామి కొన్ని కథలు రాసుకున్నారు.ప్రొడ్యూసర్ సురేష్ బాబుకి వినిపించాలని అనుకున్నారు. ముందుగా గణేష్ కథ చెప్పడంతో వెంటనే ఒకే అయింది.

దాంతో మిగిలిన కథలు చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వ ఆసుపత్రి తీరుతెన్నులు, కార్పొరేట్ ఆసుపత్రుల ఆగడాలు గురించి చెబుతున్న గణేష్ కథ విని, సురేష్ బాబు ఒకే చెప్పేసాడు. తిరుపతి స్వామి ఒరిజనల్ గా జర్నలిస్ట్ కావడంతో చూసిన సంఘటనల ఆధారంగా గణేష్ కథ రాసాడు. మాటలు పరుచూరి బ్రదర్స్ , సాంగ్స్ కి మణిశర్మ ఒకే చేసారు. హీరోయిన్ గా రంభ, ఫ్లాష్ బ్యాక్ కథకు మధుబాల ను తీసుకున్నారు. విలన్ గా తెలంగాణ యాసలో మంత్రి గెటప్ కోసం కోట శ్రీనివాసరావు ఒక్కరే అందరి మదిలో మెదలడంతో ఒకే చేసారు. తక్కువ నిడివితో ఉండే పాత్రకు రేవతి ని సెలెక్ట్ చేసారు.

ఇక 1997విజయదశమి నాడు సినిమా స్టార్ట్. దర్శకరత్న దాసరి నారాయణరావు చీఫ్ గెస్ట్ గా వచ్చి గౌరవ దర్శకత్వం వహించారు. హైదరాబాద్ సిటీ కాలేజ్ లో కీలక సన్నివేశాలు తీశారు. వేగంగా అన్నీ పూర్తవ్వడంతో 1998జూన్ 19న సినిమా రిలీజ్. భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. వెంకీ నటనకు జనం నీరాజనం పట్టారు. విలన్ ని హెచ్చరించే సన్నివేశం సూపర్భ్. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్ అంటూ వెంకీ చెప్పే డైలాగ్ తర్వాత మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.

జెంటిల్ మెన్ ,భారతీయుడు లాంటి సినిమాలు తెలుగులో రావడం లేదన్న వాదనకు చెక్ పెడుతూ గణేష్ మూవీ సత్తా చాటింది. 43సెంటర్స్ లో డైరెక్ట్ గా 50డేస్ ఆడిన ఈ మూవీ 4ప్రధాన కేంద్రాల్లో 100డేస్ పూర్తిచేసుకుంది. ఆరుకోట్ల 25లక్షల షేర్ తెచ్చింది.