1985 లో కృష్ణ సినిమాలు ఎన్ని సూపర్ హిట్స్ అయ్యాయో…?

1985 Superstar Krishna Ultimate Hit Movies : టాలీవుడ్ లో ఎన్నో సాంకేతిక మార్పులు తెచ్చిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో 1985వ సంవత్సరం అంత్యంత కీలకం. ఎందుకంటే వరుస హిట్స్ అందుకున్నారు. మొత్తం 8సినిమాలు రిలీజ్ కాగా, 6సూపర్ హిట్స్ అందుకుని బాక్సాఫీస్ షేక్ చేసారు.

1985జనవరి 11న అగ్నిపర్వతం మూవీతో హిట్ మొదలైంది. ఈ మూవీలో కృష్ణ డబుల్ యాక్షన్ తో అదరగొట్టారు. కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసారు. రాధ ,విజయశాంతి హీరోయిన్స్. రావుగోపాలరావు,సత్యనారాయణ,జగ్గయ్య నటించిన ఈ మూవీలో కృష్ణ డైలాగ్స్ సూపర్భ్.

ఆతర్వాత పల్నాటి సింహం మూవీ రిలీజై సెన్షేనల్ హిట్ కొట్టింది. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాధ,జయసుధ హీరోయిన్స్. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన వజ్రాయుధం మరో హిట్ అందుకుంది. శ్రీదేవి హీరోయిన్ గా గ్లామర్ ఒలకబోసింది. రావుగోపాలరావు విలనిజం,కృష్ణ హీరోయిజం ఆకట్టుకుంటాయి. కమర్షియల్ గా మరో విజయాన్ని చూసిన సూర్యచంద్ర మూవీ అక్టోబర్ 11న రిలీజ యింది. విజయనిర్మల డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో జయప్రద,రాధ హీరోయిన్స్.

అయితే నటభూషణ శోభన్ బాబుతో కల్సి మల్టీస్టారర్ గా చేసిన మహా సంగ్రామం మూవీ భారీ అంచలనాలతో వచ్చి నిరాశ పరిచింది. ఈ మూవీ మొదటి రెండు వారాలు కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన మహా సంగ్రామం మూవీలో జయసుధ,జయప్రద హీరోయిన్స్. కాగా అందరికంటే మొనగాడు, మహా మనిషి అనే రెండు సినిమాలు కూడా నిరాశ పరిచాయి.

అయితే పచ్చని కాపురం మూవీ ఇదే ఏడాది రిలీజై అద్భుత విజయాన్ని అందుకుంది. శ్రీదేవి హీరోయిన్ గా చేసిన ఈ మూవీలో కృష్ణ నటన మహిళా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. తాతినేని రామారావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదుచేసుకుంది.