గుప్పెడంత మనసు ధరణి రియల్ లైఫ్…ఎన్ని సినిమాల్లో నటించిందో…?

Guppedantha manasu serial actress dharani real Life :ఆడియన్స్ ని విశేషంగా అలరిస్తున్న స్టార్ మా ఛానల్ లోని గుప్పెడంత మనసు సీరియల్ మంచి సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇక ఇందులో హీరో రిషికి వదిన పాత్రలో నటిస్తున్న ధరణి తన అమాయకపు నటనతో,అందంతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు జ్యోతి పూర్ణిమ.

తెలుగు అమ్మాయి అయిన జ్యోతి అక్టోబర్ 11న జన్మించింది. చిన్నప్పటి నుంచి నటన అంటే మంచి మక్కువ. దీంతో పలు సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ యాక్టర్ గా చేసింది. 2004లో వచ్చిన దొంగ దొంగది మూవీలో నటించింది. ఇందులో మంచు మనోజ్,సదా హీరో హీరోయిన్స్.

సీరియల్ నటుడు జాకీ నటించిన ఈ తీర్పు ఇల్లాలిది మూవీలో కూడా జ్యోతి నటించింది. మీనాక్షి,అమెరికా అమ్మాయి వంటి పలు సీరియల్స్ లో నటించిన జ్యోతి తన నటనతో ఆడియన్స్ కి దగ్గరైంది. 2014లో టివిల్లో నటనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ గా నంది అవార్డు అందుకుంది.