బిగ్ బాస్ తెలుగు 5 లో ఎవరి పారితోషికం ఎంతో తెలుసా?

Bigg boss season5 contestants remuneration :నాలుగు సీజన్స్ పూర్తిచేసుకుని ఇటీవల 5వ సీజన్ ప్రారంభించుకుని సక్సెస్ గా రన్నవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. గడిచిన రెండు షోస్ కి హోస్ట్ గా చేసిన నాగ్ ఈ షో కోసం ఇప్పుడు దాదాపు 9కోట్లు అందుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. అలాగే కంటెస్టెంట్స్ కి కూడా వారి రేంజ్ ని బట్టి భారీగానే చెల్లిస్తున్నారట.

మొత్తం 19మంది కంటెస్టెంట్స్ ఉండగా షణ్ముఖ్ జస్వంత్ కి మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలను వారానికి ఇస్తున్నారట. ఇదే రేంజ్ లో యాంకర్ రవికి కూడా ఇస్తున్నారట. అయితే అందరి కంటే రవికే ఎక్కువ ముట్టజెబుతున్నారని టాక్. కొరియోగ్రాఫర్ యాని మాస్టర్ కి వారానికి మూడు లక్షలు ఇస్తున్నట్లు వినిపిస్తోంది. యాంకర్ లోబోకి కూడా ఇదే రేంజ్ లో అందిస్తున్నారట.

స్టార్ సింగర్ రామచంద్రకు వారానికి రెండు లక్షలు ఇస్తున్నట్లు టాక్. అలాగే సినీ నటి ప్రియ, మోడల్ జెస్సీకి కూడా ఇదే మొత్తం ఇస్తున్నారట. ఎలిమినేటి అయిన సరయుకి 70లక్షలు, ఉమాదేవికి 80లక్షల చొప్పున ఇచ్చారట. నటుడు విశ్వ, ప్రియాంక సింగ్, సిరి హన్మంత్, శ్వేతా వర్ష, నటరాజ్ మాస్టర్, విజె సన్నీలకు వారానికి 60వేల చొప్పున ఇస్తున్నట్లు టాక్.