Healthhealth tips in telugu

దగ్గు, జ్వరం, జలుబు, గొంతు నొప్పి, ఛాతీలో కఫంని 1 రోజులో తగ్గించి ఇమ్యూనిటీ ని రెట్టింపు చేస్తుంది

Natural Cough Remadies In Telugu : సీజన్ మారినప్పుడు దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటివి వచ్చేస్తు ఉంటాయి. ఇవి ఒకసారి వచ్చాయంటే తొందరగా తగ్గవు. మందులు వేసుకున్న సరే తొందరగా ఉపశమనం ఉండదు. అయితే దగ్గు,జలుబు వంటి వాటికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి. ఈ రోజు దాల్చిన చెక్కతో ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకుందాం.

దాల్చినచెక్కను వెగించి పొడిగా చేసుకోవాలి. మార్కెట్ లో దాల్చిన చెక్క పొడి లభ్యం అవుతుంది. కానీ ఇంటిలో చేసుకున్న పొడి అయితే మంచిది. ఒక బౌల్ లో ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం అరస్పూన్ తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగాలి.

ఈ విధంగా మూడు రోజుల పాటు తీసుకుంటే దగ్గు,గొంతు నొప్పి,గొంతు ఇన్ ఫెక్షన్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ రెమిడీ దగ్గు సమస్యలను తగ్గించటమే కాకుండా అధిక బరువు సమస్య, రక్తపోటు తగ్గించటానికి చాలా బాగా సహాయప్డుతుంది. దాల్చిన చెక్క, తేనె, పసుపులో ఉన్న గుణాలు దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.