Healthhealth tips in telugu

ఈ పొడిలో ఉన్న ఈ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు..ఇది నిజం…అసలు నమ్మలేరు

Sonthi Health benefits In Telugu :శొంఠి పొడిని ప్రతి రోజు పావు స్పూన్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. శొంఠి పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ ఇంటిలో తయారుచేసుకుంటేనే మంచిది. శొంఠి కొమ్ములను తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టి ముక్కలుగా చేసి నూనె లేదా నెయ్యిలో వెగించి చల్లారాక పొడిగా చేసుకోవాలి.

ఈ పొడిని మధ్యాహ్నం భోజనం సమయంలో అన్నంలో కలుపుకొని మొదటి ముద్దగా తినవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ శొంఠి కలిపి తాగితే సరిపోతుంది. ఈ విధంగా శొంఠి పొడి తీసుకోవటం వలన కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. శరీరంలో అదనంగా ఉన్న గ్యాస్ ని తొలగిస్తుంది. ఒక వేళ శరీరంలో గ్యాస్ ఎక్కువగా ఉంటే ఆ గ్యాస్ కీళ్ల మధ్యకు చేరి కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది.

గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం,అజీర్ణం వంటి సమస్యలకు మంచి పరిష్కారంగా చెప్పవచ్చు. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ నుండి బయట పడేయటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

డయబెటిస్ ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బరువు టాగ్గాలని అనుకొనేవారికి కూడా ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటమే కాకుండా తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది.

శొంఠి చెడు కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.అలాగే రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. కాబట్టి ప్రతి రోజు పావు స్పూన్ శొంఠి పొడి తినటానికి ప్రయత్నం చేయండి.