దుమ్ము రేపుతున్న స్టార్ హీరోల వారసులు

Young Heroes in Tollywood : సినిమా ఇండస్ట్రీలో ఓపక్క అగ్ర హీరోలు 60ప్లస్ లో కూడా దూసుకెళ్తుంటే, మరోపక్క వాళ్ళ వారసులు కూడా స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇంకో పక్క అగ్ర హీరోల అక్కలు, చెల్లెళ్ళ కుమారులు కూడా సినీ వారసులుగా రావడంతో పాటు టాలెంట్ తో కొందరు యువకులు కూడా సొంతంగా హీరోలుగా ఇండస్ట్రీకి వస్తున్నారు.

ఇలా వస్తున్న యంగ్ హీరోలు హిట్స్ కొడుతున్నారు. ఈవిధంగా ఒక పక్క పాత హీరోలు, మరోపక్క కొత్తతరం యంగ్ హీరోలు ఇండస్ట్రీలో దుమ్ము రేపుతున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో థియేటర్స్‌లో సినిమాల రిలీజ్ కి వెనుకాడుతున్న నేపథ్యంలో ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం మంచి హిట్ అందుకున్నాడు.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఇతడి చేతిలో 4 సినిమాలున్నాయి.

మెగా కుటుంబం నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ఉప్పెన మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే తాజాగా కొండపొలం సినిమా చేసి, నిరాశ పరిచాడు. అయితే ఇతడికి మంచి భవిష్యత్ ఉందని టాక్. ఇక హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఆమధ్య నిర్మలా కాన్వెంట్ తో ఎంట్రీ ఇచ్చి, ఈమధ్య పెళ్లి సందD మూవీతో సక్సెస్ కొట్టాడు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీతో ఆకట్టుకుని తాజాగా పుష్పక విమానంతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. నిర్మాత బెల్లంకొండ సురేష్ కుటుంబం నుంచి ఇప్పటికే శ్రీనివాస్ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోగా అతడి తమ్ముడు గణేష్ కూడా హీరో గా ఎంట్రీ ఇస్తూ, ఏకంగా ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు.

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ చైల్డ్ ఆర్టిస్టుగా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక రొమాంటిక్ మూవీతో అక్టోబర్ 29న ఆడియన్స్ ముందుకి వచ్చి యావరేజ్ కలెక్షన్స్‌తో పర్లేదనిపించాడు. మున్ముందు ఎలాంటి సెన్షేషన్ సృష్టిస్తాడో చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు సింహా కూడా మత్తు వదలరా మూవీతో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత తెల్లవారితే గురువారం మూవీతో వచ్చాడు.

అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు భాగ్ సాలే అంటూ వస్తున్నాడు. బడా నిర్మాతల జాబితాలో చేరిన దిల్ రాజు కుటుంబం నుంచి వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. వాళ్ళ అన్నయ్య కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా రౌడీ బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు.