ఈ ఆకులను నీటిలో మరిగించి తాగితే జలుబు,దగ్గు,గొంతు నొప్పి,గొంతు ఇన్ ఫెక్షన్ అనేవి ఉండవు

Health Tips For Cough In Telugu :ఈ చలికాలంలో దగ్గు,జలుబు,గొంతునొప్పి అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి. కానీ తగ్గాలంటే చాలా సమయం పడుతుంది. దగ్గు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మందులు వాడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. దగ్గు ఎక్కువగా ఉంటే మాత్రం మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కా కూడా ఫాలో అయితే తొందరగా ఉపశమనం పొందవచ్చు.

ఈ చిట్కా కోసం ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి నీరు కాస్త వేడెక్కాక 10 నుంచి 15 పుదీనా ఆకులను వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన ఈ నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరచెక్క నిమ్మరసం, అరస్పూన్ తేనె కలిపి తాగాలి.
Pudina Health benefits in telugu
ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగాలి. ఈ విధంగా 2 రోజులు తాగితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ అన్నీ తగ్గిపోతాయి. పుదీనాలోని యాంటి ఇన్​ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్​ లక్షణాలు దగ్గు, జలుబు, ఫ్లూ ని తగ్గించటానికి సహాయపడుతుంది.

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. తేనె గొంతుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. తేనె మంచి యంటీబయాటిక్‌గా పని చేస్తుంది. దగ్గు సమస్యకు తేనె చెక్ పెడుతుంది. దగ్గుతో పాటు గొంతు సమస్యను నియంత్రిస్తుంది.