Healthhealth tips in telugu

కరివేపాకుతో ఇలా చేస్తే కంటి చూపు పెరిగి కళ్ళజోడు అవసరమే ఉండదు

How to increase eyesight home remedies in telugu : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పిల్లలు ఎక్కువగా ఆన్లైన్ చదువుల కారణం మరియు ఎక్కువగా మొబైల్ వాడకం, ఎక్కువ సమయం టి‌వి చూడటం వంటి కారణాలతో చాలా చిన్న వయస్సులోనే కళ్ళజోడు అవసరం వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ చిట్కా పాటించండి.
curry leaves
కంటి చూపు బాగుండాలన్నా, కంటికి సంబందించి సమస్యలు ఏమి రాకుండా ఉండాలన్నా విటమిన్ A సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసు కోవాలి.అలాంటి ఆహారాలలో కరివేపాకు ఒకటి. కరివేపాకును ప్రతి రోజు మనం కూరల్లో వాడుతూ ఉంటాం. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అవి కార్నియాను రక్షించడంలో సహాయపడతాయి.

కంటి చూపు బలహీనపడకుండా నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతి రోజు 4 లేదా 5 కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగేయవచ్చు. లేదా రసం తయారుచేసుకొని తాగవచ్చు. కొన్నికరివేపాకు ఆకులు తీసుకుని రెండు స్పూన్లు నీళ్లు వేసి పేస్ట్ గా చేయాలి. బాగా పేస్ట్ అయిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి మళ్లీ మెత్తగా గ్రైండ్ చేయండి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వడకట్టి ప్రతి రోజు తాగాలి. ఈ రసం పది రోజులు తాగితే ఆ తేడా మీకు బాగా కనపడుతుంది. అంతేకాక రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా ఈ రసాన్ని తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. ముఖ్యంగా పిల్లలకు ప్రతి రోజు కరివేపాకును ఆహారంలో బాగంగా చేస్తే మంచిది.